సింపుల్ గా చెప్పాలంటే, కిచ్చా సుదీప్ బిగ్ బాస్ షో స్టేజ్ మీదకు ఎలాంటి షూస్ లేకుండా వచ్చి హోస్ట్ చేయడం అందరికీ నచ్చింది. కన్నడ ప్రేక్షకులు కిచ్చా సుదీప్‌ని ఎంతగా ఇష్టపడతారో తెలుసు కదా? ఆయన చాలా ఏళ్ళుగా కన్నడ బిగ్ బాస్ షోకి హోస్ట్‌గా ఉన్నారు. ఈసారి ఆయన స్టేజ్ మీదకు వట్టికాళ్లతో రావడానికి కారణం ఆయన నవరాత్రి వ్రతం చేయడమే.
నవరాత్రి వ్రతం చేసేవాళ్ళు తొమ్మిది రోజుల పాటు ఎలాంటి పాదరక్షలు వేసుకోరు. అందుకే కిచ్చా సుదీప్ కూడా సూపర్ సండే ఎపిసోడ్‌లో చెప్పులు లేదా బూట్లు వేసుకోకుండా హోస్ట్ చేశారు. దానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హిందూ దేవతలు, హిందూ సాంప్రదాయాల పట్ల ఈ హీరో చూపిస్తున్న గౌరవాన్ని చూసి చాలామంది ఫిదా అవుతున్నారు. ఆయన భక్తికి హాట్సాఫ్ చెబుతున్నారు.
ఇకపోతే కిచ్చ సుదీప్ కేవలం కన్నడ సినిమాల్లోనే కాకుండా, తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో కూడా నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో ఆయనకు చాలా మంచి స్నేహం ఉంది.
నటనతో పాటు, ఆయన బ్యాక్‌గ్రౌండ్ సింగర్‌గా కూడా పేరు తెచ్చుకున్నారు. బాహుబలి మొదటి భాగంలో చిన్న పాత్రలో కనిపించడంతో పాటు, ‘ఈగ’ సినిమాలో కూడా నటించారు. కిచ్చా సుదీప్ సినిమాలు తెలుగులో కూడా విడుదల అవుతున్నాయి. ఇక్కడ కూడా అవి బాగా ఆడుతున్నాయి.
https://x.com/ColorsKannada/status/1842896687787852200?t=LIB8UoHPr7bh-fNWautvYA&s=19