కోలీవుడ్ దర్శకుడు కేఎస్ రవికుమార్ డైరెక్షన్లో 1999లో రిలీజ్ అయిన సినిమా నరసింహ .. ఈ సినిమాలో రజనీకాంత్ హీరోగా సౌందర్య హీరోయిన్ గా నటించిగా రమ్యకృష్ణ విలన్ పాత్రలో నటించింది .. శివాజీ గణేషన్ , లక్ష్మీ , సితార రాధారవి , నాజర్ వంటి వారు కీలక పాత్రలో నటించారు .. నరసింహ సినిమా స్టోరీ అందరికీ తెలిసిందే.. తన కుటుంబాన్ని మోసం చేసిన వారిపై రజనీకాంత్ ఎలా పగ తీర్చుకున్ని వాళ్లపై ఎలా విజయం సాధించారనేది ఈ సినిమా స్టోరీ .. ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది .. అయితే ఈ సినిమాలో రజనీకాంత్ కంటే ఎక్కువ నీలాంబరి పాత్ర చేసిన రమ్యకృష్ణకు మంచి పేరు వచ్చింది .. అయితే ఇందులో ఓ చిన్న రహస్యం దాగి ఉంది.
ఈ సినిమా విడుదలై 26 ఏళ్లు అవుతున్న ఈ సమయంలో ఈ సినిమా గురించి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమాలోని నీలాంబరి పాత్రకు స్ఫూర్తి ఎవరు అనేది డైరెక్టర్ కెవిఎస్ రవికుమార్ చెప్పుకొచ్చారు .. మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఈ పాత్రకు స్ఫూర్తి అని ఆయన చెప్పారు .. అలాగే ఈ విషయం ఆమెకు కూడా తెలుసు అని నరసింహ సినిమా చూసిన జయలలిత నీలాంబరి పాత్ర హైలెట్గా ఉందని కూడా చెప్పారని ఆయన అన్నారు .. ఈ విధంగా రమ్యకృష్ణకు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ఉన్న సంబంధాన్ని అనుబంధాన్ని ఆయన బయట పెట్టారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి