
అప్పట్లో కాలేజీకి వెళ్లే టైంలో బుక్స్ లో ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ ను ఫొటోస్ ను దాచుకునే వాళ్ళు . దానికి సంబంధించిన వార్తలు ఎన్నెన్నో విన్నాం. కాగా ఉదయ్ కిరణ్ ఎంత త్వరగా లైఫ్ లో సెటిల్ అయ్యాడో అంతే త్వరగా ఢమాల్ అంటూ ఫైనాన్షియల్ గా పడిపోయారు. దానికి కారణాలు ఏవేవో ఉన్నాయి . కాగా ఉదయ్ కిరణ్ తన కెరీర్ లో ఎన్నో సినిమాలు నటించాడు . అన్ని సినిమాలు బాగా హిట్ అయ్యాయి . కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి .
అయితే ఉదయ్ కిరణ్ తన కెరియర్ లో చేయాల్సిన కొన్ని సినిమాలు రాత్రికి రాత్రి చేతులు మారిపోయాయి . అలాంటి సినిమాలు వేరే బిగ్ స్టార్ హీరోస్ చేసి సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నారు . ఆ లిస్టులో అల్లు అర్జున్ కూడా ఉన్నాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ తెరంగేట్రం చేసిన "గంగోత్రి" సినిమాలో మొదటగా హీరోగా ఉదయ్ కిరణ్ ని అనుకున్నారట .
కానీ కొన్ని కారణాల చేత పెద్ద మనుషులు పలుకుబడితో డబ్బున్న వ్యక్తులు ఆ స్టోరీని ఉదయ్ కిరణ్ ఖాతాలో పడకుండా అల్లు అర్జున్ ఇంట్రడ్యూస్ చేసేలా మార్చేసారట. అప్పట్లో ఈ వార్త బాగా హీట్ పెంచేసింది. కేవలం ఈ ఒక్క సినిమానే కాదు చాలా సినిమాలు అలా ఉదయ్ కిరణ్ ఖాతాలో పడినట్లే పడి రాత్రికి రాత్రి వేరే హీరోల చేతుల్లోకి వెళ్లిపోయాయి అంటూ కూడా అప్పట్లో మాట్లాడుకున్నారు జనాలు . ఇవన్నీ కూడా ఉదయ్ కిరణ్ మరణానికి కారణమే అంటున్నారు జనాలు..!!