బాలయ్య అఖండ సినిమా దగ్గరనుంచి నందమూరి ఫ్యామిలీకి నందమూరి అభిమానులకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బాగా దగ్గర అయిపోయాడు . ముఖ్యంగా బాలయ్య సినిమా అంటే తమన్‌ మ్యూజిక్ ఉండాల్సిందే అన్నట్టు అభిమానులు కూడా బాగా ఫిక్స్ అయిపోయారు .. బాలకృష్ణ కూడా తమన్‌ను విషయంలో ఎంతో పాజిటివ్గా చూస్తున్నారు .. ఈ సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజుఔ్‌ సినిమాలో కూడా తమన్‌ ఇచ్చిన మ్యూజిక్ మరో లెవల్ లో ఉంది .. ఇక దీంతో బాలయ్య అభిమానులు తమన్‌ను నందమూరి కుటుంబానికి చెందిన వ్యక్తి అని అతని పేరు ఇకనుంచి నందమూరి తమన్ అంటూ కూడా కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. రీసెంట్ గానే రెండు కోట్ల ఖరీదైన కార్ని కూడా బాలయ్య తమన్‌కు గిఫ్ట్ గా ఇచ్చారు .. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ గా మారాయి .. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తమన్‌కు భారీ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది .


సినిమా ఇండస్ట్రీని రాష్ట్రంలో ప్రోత్సహించాలని చూస్తున్న ఏపీ ప్రభుత్వం .. స్టూడియోలకు స్థలాలు కేటాయిస్తూ వస్తుంది .. ఇక తాజాగా అమరావతిలో మ్యూజిక్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు తమన్ కు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి . అమరావతి పరిధిలో మూడు ఎకరాల స్థలాన్ని ఈ మ్యూజిక్ అకాడమీకి కేటాయించబోతున్నట్లు తెలుస్తుంది .. నందమూరి బాలకృష్ణ చొరవతో ఈ విషయంలో సీఎం చంద్రబాబు ఈ ఫైల్ ను వేగంగా ముందుకు మూవ్ చేస్తున్నారని కూడా అంటున్నారు .. అలాగే అతి త్వరలోనే ఈ అకాడమీకి బాలకృష్ణ స్వయంగా భూమి పూజ చేస్తారని కూడా రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. చిత్ర పరిశ్రమ ఎలాగైనా ఆంధ్ర ప్రదేశ్ తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని పనిచేస్తుంది .. అయితే చిత్ర పరిశ్రమలో ఉండే పెద్దలు మాత్రం తెలంగాణలో భారీ ఆస్తులు ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రావడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇక దానికి తోడు తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు ఎంతో భిన్నంగా ఉంటాయి .. ముఖ్యంగా గత ఐదేళ్ల ప్రభుత్వ పరిపాలన సినిమా వాళ్ళలో కాస్త భయం పెంచిందని కూడా చెప్పాలి ..


ఇక దాంతోనే చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టేందుకు సరిగ్గా ఆస‌క్తి చూపించడం లేదు .. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినా సరే ఆంధ్రప్రదేశ్‌కు రావడానికి సినిమా వాళ్లు ఆసక్తి చూపించడం లేదు . అయితే ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు చిత్ర పరిశ్రమలో ఉన్న పెద్దలను ఒప్పించే దిశగా అడుగులు వేస్తున్నారు .. అలాగే తాజాగా మ్యూజిక్ అకాడమీకి రాష్ట్ర ప్రభుత్వం కొంత స్థలం కేటాయించే దిశ‌గా కూడా నిర్ణయం తీసుకోవటం పట్ల కూడా చిత్ర పరిశ్రమ నుంచి ప్రశంసల వర్షం వస్తుంది .. రీసెంట్ గానే ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మ్యూజికల్ నైట్ ఈవెంట్లో తమన్ పర్ఫామెన్స్ చేశారు .. అయితే వచ్చే సెప్టెంబర్ లో ఈ మ్యూజికల్ అకాడమీకి భూమి పూజ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి .. అలాగే దీనిపై త్వరలోనే అధికార ప్ర‌క‌ట‌న‌ కూడా వచ్చే అవకాశం ఉంది.. ప్రస్తుతం తమన్ బాలకృష్ణ కోసం అఖండ సీక్వెల్ కు  పనిచేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: