
మహేష్ బాబు హీరోగా గత ఏడాది సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం సినిమా రిలీజ్ తర్వాత నుంచి వెయిట్ చేస్తున్నాడు మాటల మాంత్రికుడు .. సీనియర్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. హీరో బన్నీ ఎప్పుడు ఖాళీగా ఉంటాడు ? ఎప్పుడు తన సినిమాకు డేట్ లు ఇస్తాడని త్రివిక్రం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాడు. ఎన్టీఆర్ తో పాటు మిగిలిన టాప్ హీరోల డేట్ లో ఇప్పట్లో ఏవి అందుబాటులో లేవు. అందుకే 2024 నుంచి త్రివిక్రమ్ వెయిటింగ్ లో ఉంటూనే ఉన్నారు పుష్ప 2 తర్వాత బన్నీ నేరుగా తన దగ్గరికి వస్తాడని ఎదురు చూస్తూ ఏడాది పాటు కాలం గడిపేసాడు త్రివిక్రం .. కానీ బన్నీ త్రివిక్రం వైపు రాకుండా అటు తమ్ముడి దర్శకుడు అట్లీ వైపు మొగ్గు చూపారు.
త్వరగా ఓ సినిమా చేయాలని అట్లీ సినిమా మొదలుపెట్టి అది కొంత పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ సినిమా మీదకు వస్తా అని బన్నీ చెప్పినట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపించాయి. కానీ పరిస్థితి చూస్తుంటే అలా జరుగుతుందా అనిపిస్తోంది. అట్లీ సినిమాకు చాలా పెద్ద స్కేల్ ఉందట .. ఈ సినిమా ప్రారంభించాక మధ్యలో మళ్లీ అటు ఇటు మరో సినిమా మీదకు రావడం అంటే అంత సులువు కాదు . పైగా గెటప్పులు ఉంటాయి. అందువల్ల త్రివిక్రమ్ - బన్నీ సినిమా ప్రారంభం అయ్యేవరకు గుసగుసలు .. సందేహాలు ఉంటూనే ఉంటాయి. ఇక బన్నీ వచ్చే వరకు అంటే మరో రెండేళ్ల కు పైగా త్రివిక్రమ్ వెయిట్ చేస్తాడా ? లేదా ఈ లోగా మరో హీరో ను ఎవరిని అయినా వెతుక్కుంటాడా ? అన్న ప్రశ్నలకు కాలమే ఆన్సర్ చేయాలి.