
ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రానున్న పలు భారీ సినిమాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ సినిమా “ హరిహర వీరమల్లు ” కూడా ఒకటి. మరి ఈ సినిమా ను మేకర్స్ మే 9 కి ప్లాన్ చేశారు .. ఇప్పటికే పలు మార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోన్న ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ఎంతో ఆసక్తి తో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ను మే 9 రిలీజ్ చేయాలని తాజా పోస్టర్ వేశారు. అయితే ఈ సినిమా ఆ డేట్ లో కూడా ఈ చిత్రం వచ్చే సూచనలు కనిపించడం లేదని ఇండస్ట్రీ వర్గాల టాక్ ? అందుకే సమంత తన ప్రొడక్షన్ సినిమాని ఆ డేట్ కి లాక్ చేసుకోవడంతో పవన్ ఆ డేట్‌కు రావడం లేదన్న టాక్ మరింత బలపడింది.
అయితే ఇపుడు పవన్ కళ్యాణ్ ... విజయ్ దేవరకొండ డేట్ కి రానున్నట్టుగా సమాచారం. విజయ్ దేవరకొండ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా కింగ్‌డమ్ మే 30 కు షెడ్యూల్ అయి ఉంది. లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ డేట్ లో వీరమల్లు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. అంటే దీనిని బట్టి విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ వాయిదా పడుతోందని తెలుస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌తో సమస్య మీది.. పరిష్కారం మాది..
అవినీతి అయినా.. లంచాలైనా.. రాజకీయ నాయకులు పెట్టే ఇబ్బందులు అయినా మీ సమస్యను మా సమస్యగా భుజాన వేసుకుంటాం. నేతలు పట్టించుకోవడం లేదని.. అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని చింతించాల్సిన అవసరమే లేదు. రండి.. చేయి చేయి కలుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ సమస్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.. పరిష్కార మార్గాన్ని పొందండి.