టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దాదాపు రెండు మూడు నెలలుగా థియేటర్ల వద్ద డల్ వాతావరణం కనిపిస్తుంది .. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు వస్తున్నాయి కానీ కనీసం మినిమం ఓపెనింగ్ లు కూడా అందుకోవటం లేదు .. మధ్యలో సిద్దూర్ జొన్నలగడ్డ జాక్ మూవీ వస్తుందంటే ఎగ్జిబిటర్లు కాస్త ఆశ‌పడ్డారు కానీ ఆ సినిమాకు కూడా మినిమం ఓపెనింగ్‌లు రాలేదు .  ఇక దీంతో థియేటర్లు దివాలా తీసాయి .. ఇక ఈ వారం రెండు సినిమాలు వచ్చాయి .. ఓదెల 2 , అర్జున్ సన్నాఫ్ వైజయంతి .. ఈ వారం కూడా ఎలా ఉంటుందని ఎగ్జిబిటర్లు ఆశగా చూశారు ..


ఇక వచ్చేవారం కూడా సారంగాపాణి జాతకం ఆనే చిన్న సినిమా కూడా ఉంది .. దానికి డబ్బులు కట్టాలంటే ఈ వారం సినిమాలు బాగా ఆడాలి .. అయితే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో విడుదలైన ఈ వారం సినిమాల్లో .. ఓదెల 2 విడుద‌ల రోజున పరవాలేదనే ఓపెనింగ్స్‌ ను రాబట్టుకుంది .. గురువారం కవటం వల్ల ఆశించిన మేరకు ఓపెనింగ్స్‌ రాలేదు .. కానీ రెండో రోజు వచ్చిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ రిలీజ్ అయింది ఈ ఎఫెక్ట్‌ .. ఓదెల 2 మీద పడింది .. అయితే ఇక్కడ అర్జున్ సన్నాఫ్ వైజయంతి మాత్రం కాస్త రీజనబుల్ ఓపెనింగ్స్ అందుకుంది ..


అలాగే చాలా సెంటర్స్ లో హౌస్ ఫుల్  పడ్డాయి .. ఇలా ఈ రెండు సినిమాలకు కాస్త డివైడ్ టాక్ తెచ్చుకున్నాయి .  దీని కారణంగా శనివారం నాడు ఏ సినిమాకు జనం సెలెక్ట్ చేసుకుంటారు అన్నది దాన్ని బట్టి అసలు విషయం తెలుస్తుంది .. హర్రర్ సినిమాలు నచ్చేవారు  ఒదెల 2 ను ఎంచుకోవచ్చు .. క‌థ‌ ఓల్డ్ అయిన ఫైట్లు స్టార్ కాస్ట్ ఇవన్నీ కలిసి అర్జున్ సన్నాఫ్‌ వైజయంతికి చిన్న కలర్ లుక్ ఇచ్చాయి .. అందువల్ల ఇది కాస్త‌ ఎడ్జ్ తీసుకుంటుందని కూడా అంటున్నారు .. ఇలా ఈ వారం బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను మెప్పించి ఎగ్జిక్యూటర్ల కు కొంత రిలీఫ్ ఇచ్చాయని చెప్పవచ్చు ..

మరింత సమాచారం తెలుసుకోండి: