
తర్వాత 2017లో ఖైదీ నెంబర్ 150 సినిమాతో అటు బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇద్దరు విజయం సాధించారు. మరోసారి 2023 సంక్రాంతి కానుకగా చిరంజీవి వాల్తేరు వీరయ్య - బాలయ్య వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి ఇద్దరు సూపర్ హిట్లు కొట్టారు. ఇప్పుడు మరోసారి వచ్చే సంక్రాంతికి ఈ ఇద్దరు హీరోలు పోటీపడుతున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి - అనిల్ రావి పూడి సినిమా ఇప్పటికే సంక్రాంతికి రిలీజ్ కు రెడీ అవుతోంది. అటు బాలయ్య - బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న అఖండ 2 సినిమా కూడా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక మరోసారి ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాలతో పోటీ పడితే వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ వేడెక్కటం ఖాయం.
ఈ వాట్సాప్ నెంబర్‌తో సమస్య మీది.. పరిష్కారం మాది..
అవినీతి అయినా.. లంచాలైనా.. రాజకీయ నాయకులు పెట్టే ఇబ్బందులు అయినా మీ సమస్యను మా సమస్యగా భుజాన వేసుకుంటాం. నేతలు పట్టించుకోవడం లేదని.. అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని చింతించాల్సిన అవసరమే లేదు. రండి.. చేయి చేయి కలుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ సమస్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.. పరిష్కార మార్గాన్ని పొందండి.