కోలీవుడ్ హీరో ధనుష్ తాజాగా నటిస్తున్న చిత్రం ఇడ్లీ కడై.. ఇందులో హీరోయిన్గా నిత్యమీనన్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న సమయంలో గడిచిన కొన్ని గంటల క్రితం సినిమా షూటింగ్ సెట్లో భారీ అగ్నిప్రమాదం జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇడ్లీ కడై సినిమా కోసం వేసిన సెట్లో ప్రమాదవశాత్తు పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తి చెందాయని దీంతో తేని జిల్లాలోని అండిపట్టిలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా సమాచారం .


అయితే ఈ ప్రమాదం జరిగిన సెట్లు కీలకమైన సామాగ్రిలు కూడా కాలిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం గురించి అక్కడి స్థానికుల అగ్నిమాపక సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది కూడా ఆ సంఘటన స్థలానికి వచ్చి అగ్ని ప్రమాదానికి గల కారణాలను ఏంటి అన్నట్లుగా దర్యాప్తు చేస్తున్నారు.అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో షూటింగ్ లేకపోవడంతో ఈ ప్రమాదం నుంచి బయటపడినట్లుగా తెలుస్తోంది. పాన్ ఇండియా లెవెల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.


చివరిగా రాయన్ సినిమాలో నటించిన ధనుష్ ఆ తర్వాత తమిళంలో ఒక సినిమాని దర్శకత్వం వహించారు ఇప్పుడు తాజాగా కూడా ఇడ్లీ కడై సినిమాకి స్వయంగా తానే దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. అలాగే నిర్మాతగా కూడా తన బ్యానర్ ని భాగస్వామ్యం చేశారు. అలాగే ఇందులో సత్యరాజ్, రాజ్ కిరణ్,ప్రకాష్ రాజ్ తదితర నటి నటుల శాతం కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. మొత్తానికి తన స్వీయ దర్శకత్వంలోనే జరుగుతున్న ఇడ్లీ కడై సినిమా షూటింగ్ సమయంలో ఇలాంటి ప్రమాదం జరగడంతో ధనుష్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇకమీదట ఇలాంటివి జరగకుండా తగిన చర్యలు చేపట్టి సినిమా షూటింగ్ చేపట్టాలని అభిమానులు సలహా ఇస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం పైన ధనుష్ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: