మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకుంది. ఆ సినిమా అనంతరం ఈ చిన్నది హ్యాపీ డేస్ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు అందుకుంది. ఈ సినిమా అనంతరం తమన్నా అనేక సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తుంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ, కన్నడ, మలయాళం సినిమాలలో నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

 ఈ చిన్నది సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 20 ఏళ్లకు పైనే అవుతున్నప్పటికీ ఇప్పుడు కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ పోతోంది. తమన్నా హీరోయిన్ గా మాత్రమే కాకుండా స్పెషల్ సాంగ్స్ లోనూ నటిస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాను సినిమాలలో చేసే స్పెషల్ సాంగ్స్ గురించి వెల్లడించారు. స్పెషల్ సాంగ్స్ చేయడం నాకు ఎప్పుడూ కూడా తప్పు అనిపించలేదని తమన్నా అన్నారు. దాదాపు పదేళ్ల నుంచి అవకాశం వచ్చినప్పుడల్లా స్పెషల్ సాంగ్స్ చేస్తూనే ఉన్నానని ఏ విషయాన్ని కూడా లిమిట్స్ దాటి చూడాలి అని తమన్నా చెప్పారు.

నేను ఎప్పుడూ అలానే చూస్తాను స్పెషల్ సాంగ్ అనేది ఓ ఎమోషనల్ గా నేను భావిస్తానని తమన్నా అన్నారు. నేను నా అందమైన రూపంతో స్పెషల్ సాంగ్ కు డ్యాన్స్ చేయడం మ్యాజిక్ గా ఉంటుందని నా ఫీలింగ్. చాలా మంది స్పెషల్ సాంగ్స్ చేస్తుంటే నన్ను మరోలా చూస్తున్నారని తమన్న అన్నారు. అది ఏదో పెద్ద తప్పుగా చూస్తున్నారు అది చాలా తప్పు అని తమన్నా వెల్లడించారు. ప్రస్తుతం తమన్న షేర్ చేసుకున్న ఈ విషయాలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: