అలనాటి అందాల తార నటి మీనా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చక్కటి అందం, నటనతో ఈ చిన్నది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మీనా ఒకానొక సమయంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఉపేసిందని చెప్పవచ్చు. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా చేసి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. మీనా తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగించింది. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళం, హిందీ సినిమాలలో హీరోయిన్ గా అనేక సినిమాలలో నటించింది. 

ఇక తన కెరీర్ మంచి ఫామ్ లో కొనసాగుతున్న సమయంలోనే మీనా విద్యాసాగర్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి ఓ బిడ్డ కూడా జన్మించింది. వివాహం తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉన్న మీనా కొద్ది రోజుల తర్వాత మళ్లీ ఎప్పటిలానే సినిమా షూటింగ్ లలో చాలా చురుగ్గా పాల్గొంది. ఈమధ్య కాలంలో మీనా హీరోయిన్ గా అవకాశాలను కోల్పోయింది. కేవలం తల్లి, అక్క వంటి పాత్రలలో మాత్రమే నటిస్తూ మంచి అవకాశాలను అందుకుంటుంది. ఇక మీనా భర్త 2022 సంవత్సరంలో అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. మీనా భర్త మరణించిన అనంతరం తాను మరో వివాహం చేసుకుంటుందని అనేక రకాల వార్తలు వచ్చినప్పటికీ మీనా వాటిపై స్పందించలేదు.

కానీ ఇప్పటివరకు మీనా ఎవరిని కూడా వివాహం చేసుకోలేదు. దానికి గల ప్రధాన కారణం తన కూతురు గురించి ఆలోచించి మీనా మరో వివాహం చేసుకోకూడదని నిర్ణయం తీసుకుందట. ఇదిలా ఉండగా.... మీనాకు సంబంధించి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది. మీనా సినిమాలలో హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలో ఓ తమిళ హీరో తనను టార్చర్ చేశాడట. తనను వివాహం చేసుకోమని లేదా తనతో కమిట్మెంట్స్ కి ఒప్పుకోవాలని చాలా ఇబ్బంది పెట్టారట. ఇక మీనా ఆ హీరోని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు పోయిందట. ఈ విషయాన్ని మీనా స్వయంగా ఓ సందర్భంలో వెల్లడించారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: