
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ సినిమా తీసిన శంకర్ ఒకసారిగా సైలెంట్ అయ్యారు. అంతకు ముందు కమలహాసన్తో తీసిన భారతీయుడు 2 సినిమా కూడా డిజాస్టర్ అయింది .భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు పెద్ద డిజాస్టర్లు అయ్యాయి. ఒకవేళ గేమ్ ఛేంజర్ హిట్ అయి ఉంటే టాలీవుడ్లో శంకర్ క్రేజ్ వేరేలా ఉండేది .. ఇప్పుడు శంకర్ పరిస్థితి ఎంత దారుణ స్థితికి దిగజారి పోయింది అంటే ఆయన తెరకెక్కించిన భారతీయుడు 3 సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీడీలో రిలీజ్ అవుతుందని ప్రచారం జరగడమే. అయితే భారతీయుడు థియేటర్ రిలీజ్ లేదని.. ఓటీటీ రిలీజ్ అన్న ప్రచారం జరగడంతో నిర్వాహకులు తిరిగి భారతీయుడు 3 సినిమా ను థియేటర్లలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇది ఇలా ఉంటే శంకర్ కనీసం రెండేళ్లకు పైగా సినిమాలుకు గ్యాప్ ఇచ్చే వాతావరణం కనిపిస్తోంది.
ఇప్పుడున్న పరిస్థితులలో ఆయన రెండేళ్లపాటు విశ్రాంతిలో ఉంటారని ... ఈ రెండు సినిమాల పరాజయాల నుంచి కోలుకున్నాక ఆయన ఎవరితో కొత్త సినిమా చేయాలో ? ఆలోచన చేస్తారని అంటున్నారు. అసలు ఇప్పుడున్న పరిస్థితులలో శంకర్తో సినిమాలు చేసేందుకు ఏ స్టార్ హీరో కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. మామూలుగానే శంకర్ సినిమాలకు మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది ... ఈ సారి రెండు పెద్ద డిజాస్టర్ ల నేపథ్యంలో చాలా ఎక్కువ టైం తీసుకుంటారని కొన్నాళ్లపాటు సినిమాలకు పూర్తి దూరంగా ఉంటారని తెలుస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌తో సమస్య మీది.. పరిష్కారం మాది..
అవినీతి అయినా.. లంచాలైనా.. రాజకీయ నాయకులు పెట్టే ఇబ్బందులు అయినా మీ సమస్యను మా సమస్యగా భుజాన వేసుకుంటాం. నేతలు పట్టించుకోవడం లేదని.. అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని చింతించాల్సిన అవసరమే లేదు. రండి.. చేయి చేయి కలుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ సమస్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.. పరిష్కార మార్గాన్ని పొందండి.
నోట్ : వ్యక్తిగత, కుటుంబ సమస్యలు వద్దు