- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

తన శైలికి పూర్తి భిన్నంగా మహేష్ బాబు సినిమా విషయంలో ముందుకు వెళుతున్నాడు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి .. ఈ సినిమా గురించి ఎలాంటి ప్రకటన లేదు .. ప్రెస్ మీట్ లేదు .. ఎలాంటి అధికారికి ప్రకటన లేకుండా కొబ్బరికాయ కొట్టి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టేశారు. రేపో మాపో యూనిట్ మొత్తం ఆఫ్రికా అడవులకు షిఫ్ట్ అవ్వబోతుంది. ఈ మేరకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఖైరతాబాద్ ఆర్టిఏ ఆఫీస్ కి వచ్చి ఫార్మాలిటీస్ పూర్తి చేశాడు రాజమౌళి. అటు మహేష్ బాబు కూడా భారీ యాక్షన్ ఎపిసోడ్ కోసం శారీరకంగా మానసికంగా రెడీగా ఉన్నాడట. ఎందుకైనా మంచిది కాస్త ముందుగానే ఓ విదేశీ పర్యటన కూడా వేసి వచ్చేసాడు. హీరోయిన్ ప్రియాంక చోప్రా మళ్ళీ హైదరాబాదులో ల్యాండ్ అయిం.ది ఇప్పటికే రెండు షెడ్యూల్ పూర్తి చేసిన ఆమె మరో షెడ్యూల్ కి రెడీ అవుతోంది.


మహేష్ - రాజమౌళి సినిమాకి సంబంధించి చాలా వర్క్ తెర‌వెన‌క‌ నడుస్తుంది .... కానీ ప్రేక్షకులకు ఒక్క అప్డేట్ కూడా లేదు. మహేష్ బాబు లేదా రాజమౌళి ఇప్పటి వరకు నోరు తెరిచి మాట్లాడింది లేదు. చివరికి సుమ లాంటి సీనియర్ యాంకర్ నిండు సభలో నేరుగా రాజమౌళిని ప్రశ్నించినా నవ్వుతూ సమాధానం దాటవేశాడు తప్ప ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడు మరోసారి అలాంటి సందర్భమే రాబోతుంది .. నాని సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు రాజమౌళి చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించాడు. కనీసం ఈసారికైనా రాజమౌళి తను చేస్తున్న మహేష్ బాబు సినిమాపై ఓ ప్రకటన చేస్తాడని అందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌తో స‌మ‌స్య మీది.. ప‌రిష్కారం మాది..

అవినీతి అయినా.. లంచాలైనా.. రాజ‌కీయ నాయ‌కులు పెట్టే ఇబ్బందులు అయినా మీ స‌మ‌స్య‌ను మా స‌మ‌స్య‌గా భుజాన వేసుకుంటాం. నేత‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. అధికారులు దురుసుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని చింతించాల్సిన అవ‌సర‌మే లేదు. రండి.. చేయి చేయి క‌లుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ స‌మ‌స్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.. ప‌రిష్కార మార్గాన్ని పొందండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త, కుటుంబ స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: