ఏంటి కరీనాకపూర్ ని పెళ్లి చేసుకున్న సైఫ్ అలీ ఖాన్ కి ఆ హీరో ముందుగానే వార్నింగ్ ఇచ్చారా..ఎందుకు సైఫ్ అలీఖాన్ కి ఆ హీరో కరీనాకపూర్ డేంజర్ అని వార్నింగ్ ఇచ్చారు.. కరీనాకపూర్ నిజ స్వరూపం ఆ హీరోకి ముందుగానే తెలుసా..అసలు విషయం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కరీనాకపూర్ సినిమాలు చేస్తున్న క్రమంలో ఎంతో మంది హీరోలతో డేటింగ్ చేసింది.కానీ చివరికి రెండో పెళ్లి వాడైన సైఫ్ అలీఖాన్ మాయలో పడిపోయి ఆయనకి రెండో భార్యగా సెట్ అయింది.వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఇక సైఫ్ అలీఖాన్ కి మొదట పెళ్లై ఆమెతో కూడా పిల్లలు ఉన్నారు.ఇదంతా పక్కన పెడితే సైఫ్ అలీఖాన్ కరీనాకపూర్ ని పెళ్లి చేసుకోవాలనుకున్న సమయంలో ఓ బాలీవుడ్ నటుడు ఆయనకి వార్నింగ్ ఇచ్చారట.వారిది చాలా డేంజరస్ ఫ్యామిలీ.. ఆ అమ్మాయితో జాగ్రత్త అని చెప్పారట.

అయితే కరీనాకపూర్ గురించి ఆమె ఫ్యామిలీ గురించి సైఫ్ అలీ ఖాన్ కి ఇన్ని జాగ్రత్తలు చెప్పినా ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. అయితే ఈ విషయాన్ని స్వయంగా కరీనాకపూర్ అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా నిర్వహించిన ట్వీక్ ఇండియా కోసం చేసిన చాట్ లో కరీనా చెప్పుకొచ్చింది. కరీనాకపూర్ మాట్లాడుతూ.. నాతో సైఫ్ అలీ ఖాన్ డేటింగ్ చేస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకున్న అక్షయ్ కుమార్ నేరుగా సైఫ్ అలీ ఖాన్ దగ్గరికి వెళ్లి ఆ అమ్మాయితో చాలా జాగ్రత్త.. ఆ హీరోయిన్ డేంజరస్ ఫ్యామిలీ నుండి వచ్చిన డేంజరస్ అమ్మాయి. ఆమెతో కాస్త జాగ్రత్తగా నడుచుకోండి..

ఎందుకంటే నాకు ఆమె గురించి ఆమె ఫ్యామిలీ గురించి తెలుసు కాబట్టి మీకు ముందుగానే హెచ్చరిస్తున్నాను అని సైఫ్ అలీ ఖాన్ కి జాగ్రత్తలు చెప్పారట.అయితే ఈ మాటలన్నీ విన్న సైఫ్ అలీఖాన్ నో నో నేను హీరోయిన్ కరీనాకపూర్ తో చాలా బాగా కనెక్ట్ అవుతున్నాను.ఆమెను బాగా అర్థం చేసుకున్నాను అంటూ బదులిచ్చారు. అయితే అక్షయ్ కుమార్ అలా చెప్పడానికి కారణం నాతో సైఫ్ అలీఖాన్ గొడవ పడకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పడం కోసమే ఈ విషయాన్ని చెప్పాడు అంటూ కరీనాకపూర్ ట్వింకిల్ ఖన్నాతో అక్షయ్ కుమార్ చెప్పిన మాటల్ని పంచుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: