తెలుగు సినీ ఇండస్ట్రీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు బాలీవుడ్ ని కూడా బీట్ చేసేసింది. ప్రస్తుతం టాలీవుడ్ దర్శకులు కొత్త కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. ఇండియన్ సినిమాకి ఒక్క గొప్ప గుర్తింపు వచ్చే మార్గలో ప్రయాణిస్తున్నారు. సినిమానే లక్ష్యంగా జీవిస్తున్నారు. కథతో పాటుగా ఎమోషన్, పాత్రల సెలెక్షన్, టెక్నాలజీ అన్నీ పాన్ వరల్డ్ లెవెల్ లో తీస్తున్నారు. అలాంటి దర్శకులలో ఒకరు సందీప్ రెడ్డి వంగా.

టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే తెలియని వారుండారు. ఈయన అర్జున్ రెడ్డి సినిమాతో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఇటీవల యానిమల్ సినిమాతో కూడా సందీప్ రెడ్డి వంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టేశారు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా అటు బాలీవుడ్ లో.. ఇటు టాలీవుడ్ లోనూ మస్తు క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పిరిట్ అనే సినిమా తీయనున్నారు. ఇక పాన్ ఇండియా దర్శకుడు.. పాన్ ఇండియా హీరో కలిసి చేసే ఈ సినిమాలా పైన ప్రేక్షకులు చాలానే అంచనాలు ఉన్నాయి.


ఇదిలా ఉండగా.. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి సినిమా ప్రశంసలతో పాటుగా విమర్శలు కూడా పొందింది. ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ నటించాడు. హీరోయిన్ గా షాలిని పాండే నటించింది. అయితే తాజాగా అర్జున్ రెడ్డి మూవీపై విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను హాలీవుడ్ సినిమాల నుండి కాపీ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా హీరో ఆవేశం, ప్రేమ హాలీవుడ్ చిత్రాలను గుర్తు చేస్తున్నాయని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా కాపీ చేశాడంటూ.. అందరూ దర్శకులలాగే సందీప్ రెడ్డి కాపీ మాస్టర్ లిస్టులో చేరిపోయాడంటూ రోల్ చేస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కానీ ఇప్పటివరకు ఈ విషయంపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పందించలేదు.





మరింత సమాచారం తెలుసుకోండి: