
ఇదిలా ఉండగా శర్వానంద్ మరో సూపర్ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. శర్వానంద్ తన కెరీర్ లో 38వ సినిమాని డైరెక్టర్ సంపత్ నంది తెరకెక్కించనున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి టాక్ మొదలైంది. ఈ మూవీని పూర్తిగా యాక్షన్ ఎంటర్టైనర్ గా మూవీ మేకర్స్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ని ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ సినిమాకి భీమ్స్ సిసి రోలియో సంగీతం అందించనున్నారు. ఈ సినిమాను నిర్మాత కె.కె రాధా మోహన్ శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు.
ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ని మూవీ మేకర్స్ రివిల్ చేశారు. ఈ సినిమాలో గ్లామరస్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించనున్నారు. దీనికి సంబంధించిన ఫ్రీ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఇది చూసిన ప్రేక్షకులు ఈ సినిమాలో అనుపమ పాత్ర ఎలా ఉండబోతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ ఇటీవలే డ్రాగన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నటుడు ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాకు హీరోగా నటించిన విషయం తెలిసిందే. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇప్పటికే హీరో శర్వానంద్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ జంటగా శతమానం భవతి సినిమాలో నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వంద రోజులు నడిచి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే మరోసారి ఈ కాంబో ఈ సినిమాతో రిపీట్ అవ్వబోతుంది. ఈసారి కూడా శర్వానంద్ కి ఈ సినిమా కలిసి వస్తుందని టాక్ వినిపిస్తుంది. మరి శర్వానంద్ ఈ సినిమాతో హిట్ కొడతాడా లేదా చూడాలి.