
రీసెంట్ గా ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చైతూ చాలా విషయాలు చెప్పాడు. ఆ ఇంటర్వ్యూ వైరల్ అయింది. అయితే, అభిమానుల దృష్టిని బాగా ఆకర్షించింది మాత్రం ఈ కొత్త సినిమా గురించే చైతూ చూపించిన ఉత్సాహం. ఇది గ్రాండ్ స్కేల్ లో రాబోతున్న మైథలాజికల్ థ్రిల్లర్ అని, తన కెరీర్ లో ఇదివరకు ఎప్పుడూ చేయని జోనర్ అని చెప్పాడు. ఈ కొత్త ప్రయత్నం పట్ల అభిమానులు చాలా థ్రిల్ అవుతున్నారు.
అయితే, ఇదే ఇంటర్వ్యూలో చైతూ అనుకోకుండా ఒక పెద్ద లీక్ ఇచ్చాడు. సినిమా టైటిల్ చెప్పేశాడు. వెంటనే తను తప్పు తెలుసుకుని ఆ పార్ట్ ని మ్యూట్ చేయమని ఇంటర్వ్యూవర్ ని రిక్వెస్ట్ చేశాడు. కానీ, చాలా శ్రద్ధగా వింటున్న ఫ్యాన్స్ ఊరికే ఉంటారా, అతను చెప్పింది పెదాల కదలికల ద్వారా అర్థం చేసుకుని 'లిప్ రీడ్' చేశారు. వాళ్ల అంచనా ప్రకారం, ఆ సినిమా టైటిల్ 'వృష కర్మ' అని వినిపించింది.
అయితే, ఈ టైటిల్ ను సినిమా యూనిట్ ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు. కానీ, చైతూ ఇచ్చిన ఈ లీక్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అభిమానులు ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందో, ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో చూడాలని. 'వృష కర్మ'నే ఫైనల్ టైటిల్ అవుతుందా అని చూడాలి.
అప్పటివరకు, సినిమాపై అంచనాలు, ఉత్సాహం మరింత పెరుగుతున్నాయి. కార్తీక్ దండు దర్శకత్వంలో రాబోతున్న ఈ ఫ్రెష్ అండ్ డ్రీమ్ ప్రాజెక్ట్ తో చైతూ ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తాడో చూడాలి.