టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన నాగచైతన్య విరూపాక్ష సినిమాతో హిట్ సాధించిన కార్తీక్ దండు డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వృషకర్మ అనే టైటిల్ ఫిక్స్ అయిందని సమాచారం అందుతోంది. త్వరలో ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించనున్నారు. ఒక ఇంటర్వ్యూలో టైటిల్ కు సంబంధించి నాగచైతన్య నోరు జారడంతో ఈ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది.
 
త్రవ్వకం మొదలైంది అనే క్యాప్షన్ తో మూవీ షూట్ మొదలైన విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండగా ఒకింత భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ బ్యానర్ లో తెరకెక్కి విడుదలైన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో, జాక్ సినిమాలు భారీ నష్టాలను మిగిల్చాయి. నాగచైతన్య సినిమా సక్సెస్ సాధిస్తే ఆ నష్టాలు భర్తీ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.
 
నాగచైతన్య కార్తీక్ దండు కాంబో మూవీ వచ్చే ఏడాది థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో అద్భుతాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో నాగచైతన్య మార్కెట్ మరింత పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నాగచైతన్య రెమ్యునరేషన్ 15 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.
 
పాన్ ఇండియా రేంజ్ ఉన్న కథలకే ఓటేస్తున్న నాగచైతన్య భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో ఆ రేంజ్ ఫలితాలను అందుకుంటారేమో చూడాలి. నాగచైతన్య 24వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. జయాపజయాలకు అతీతంగా కెరీర్ ను కొనసాగిస్తున్న నాగచైతన్య భవిష్యత్తు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తారేమో చూడాల్సి ఉంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. డైరెక్టర్ కార్తీక్ దండు ఈ సినిమాతో ద్వితీయ విఘ్నాన్ని బ్రేక్ చేస్తారేమో చూడాల్సి ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: