
నందమూరి నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా తెలుగు సినీ ప్రేమికులను .. ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసింది. థియేటర్ల లో ఈ సినిమా చూస్తోన్న ప్రేక్షకులు పూనకాలతో ఊగిపోయారు. కరోనా టైంలో టిక్కెట్ రేట్లు తక్కువుగా ఉన్నప్పుడే అఖండ అదర గొట్టేసింది. బాలయ్య - బోయపాటి కాంబోలో ముందుగా వచ్చిన సింహా ఆ తర్వాత లెజెండ్.. ఇక ముచ్చటగా మూడోసారి అఖండ సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్లు కొట్టాయి. దీంతో అఖండ సినిమాకు సీక్వెల్ గా వస్తోన్న ‘ అఖండ 2 – తాండవం ’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే, ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక షెడ్యూల్‌ను యూరప్ లో షూట్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధ మవుతోంది. ఈ షెడ్యూల్ గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఇప్పుడు వినిపిస్తోంది. ఈ షెడ్యూల్ లో ఓ బాలీవుడ్ నటుడు పాల్గొనబోతున్నట్టు గా తెలుస్తోంది. ఆ నటుడు బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ డియోల్ అంటున్నారు. ఇక సెకండాఫ్ లో వచ్చే సన్నీ డియోల్ క్యారెక్టర్ తో నే సినిమా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అదిరి పోతుందని .. థియేటర్ల లో సినిమా చూసే ప్రేక్షకుడి ఊహకు ఏ మాత్రం అందకుండా ఉంటుందని అంటున్నారు.
ఈ క్లైమాక్స్ ట్విస్ట్ కు అఖండ 3 సినిమాకు లింక్ ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ వార్తలు నిజం అయితే అఖండ 2 సినిమా కు ఇప్పటి వరకు ఉన్న క్రేజ్ డబుల్ అవ్వడం ఖాయం అనుకోవాలి. ఇప్పటికే ఈ సినిమా లో విలన్ గా యంగ్ హీరో ఆది పినిశెట్టి ఉన్నారు. ఇక హీరోయిన్ గా సంయుక్త మీనన్ ను తీసుకున్నారు. ఇప్పుడు సన్నీ డియోల్ ఎంట్రీ తో నార్త్ లో కూడా క్రేజ్ మామూలుగా ఉండదు. ఈ వార్త మాత్రం బాలయ్య ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ను ఇస్తోంది. కాగా ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.