టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన చివరి మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజై బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిక్స్డ్ టాక్ తోనూ భారీ కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ సినిమా.. తాజాగా జపాన్ వర్షన్‌లోను రిలీజ్ అయి భారీ ఆదరణ దక్కించుకుంది. ఈ క్రమంలోనే పాన్ ఇండియా లెవెల్ లో సినిమా సీక్వెల్ ఫై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం తారక్ బాలీవుడ్ వార్ 2, ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్లో డ్రాగన్ సినిమా పనులలో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.
 

ఇక సినిమా షూట్ పూర్తయిన తర్వాత.. ఎన్టీఆర్ దేవర 2 సెట్స్‌లో పాల్గొంటారని అంతా భావించారు. అయితే.. కొరటాల ఈ విషయంలో తాజాగా బిగ్ ట్విస్ట్ ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే దేవర 2 స్క్రిప్ట్ కు సంబంధించిన ఓ లేటెస్ట్ అప్డేట్ తెగ వైరల్ గా మారుతుంది. కొర‌టాల శివ ఇప్పటికే సినిమా స్క్రిప్ట్‌ని పూర్తి చేసేసాడని.. విఎఫ్ఎక్స్ పనులు కూడా ప్రారంభించేసినట్లు సమాచారం. ముఖ్యంగా.. విఎఫ్ఎక్స్ ప‌నుల‌లోలో కొరటాల చాలా కష్టపడుతున్నాడట.

 

మరిన్ని ఆసక్తికర సన్నివేశాలను మలిచేందుకు పాన్ ఇండియన్ వైడ్‌గా కొత్త ఎలిమెంట్స్‌ని యాడ్ చేసి.. ఆడియన్స్‌లో మరింత హైప్‌ను పెంచేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ ఏడాది నవంబర్ నుంచి సినిమా షూటింగ్ కూడా ప్రారంభించనున్నారని టాక్ వైరల్ గా మారుతుంది. ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట‌ వైరల్ అవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా సినిమా పూర్తిచేసి రిలీజ్ చేయాలని.. ఈ సినిమాతో తారక్ మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: