తాజాగా హిందూపురంలో బాలయ్య పద్మభూషణ్ సన్మాన సభను గ్రాండ్ లెవెల్‌లో నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్‌లో బాలయ్య ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. రాజకీయాలు, సినిమాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. అయితే ఇందులో భాగంగానే బాలయ్య మాట్లాడుతూ రాజకీయాల్లోకి ఎంతోమంది వచ్చారని.. తర్వాత అసలు నామరూపాలే లేకుండా పోయారంటూ చెప్పుకొచ్చాడు. రాజకీయాలకు కేవలం వచ్చేస్తే సరిపోదని.. ప్రజలకు ఎంతో కొంత సేవ‌ చేయాలని.. అలా చేస్తున్నాను కనుక హిందూపురం ప్రజలు మూడుసార్లు గెలిపించారంటూ బాలకృష్ణ చెప్పుకొచ్చాడు.


అయితే బాలకృష్ణ ఎవరి పేరు చెప్పకుండానే సాధారణంగా ఈ కామెంట్స్ చేసినప్పటికీ.. బాలకృష్ణ మెగాస్టార్ చిరును టార్గెట్ చేస్తూ కావాలనే ఇలాంటి షాకింగ్ అభిప్రాయాలను వ్యక్తం చేశాడంటూ మండిపడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలయ్య మధ్య వెండితెరపై ఎలాంటి పోరు కొనసాగుతుందో తెలిసిందే. అయితే కేవలం అది సినిమాలకు మాత్రమే పరిమితం కాదు. రాజకీయ రంగంలోనూ వీరిద్దరూ వేరువేరు పార్టీలలో ఒకరికి ఒకరు గట్టి పోటీ ఇచ్చుకున్నారు. గతంలో చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో, బాలకృష్ణ తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఒకరిపై ఒకరు వాక్ భాణాలను విసురుకున్నారు.

 

గతంలో చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బాలకృష్ణ ఆయనను ఉద్దేశించి ఎన్నో వ్యాఖ్యలు చేయగా.. చిరంజీవి దానికి కౌంటర్ ఇస్తూ బాలయ్య పేరులోనే బాలుడు ఉన్నాడు.. అలాంటి మాటలు నేను అసలు పట్టించుకోను అంటూ కౌంటర్ వేశాడు. తర్వాత చిరంజీవి రాజకీయాలకు గుడ్ బై చెప్పేసారు. బాలయ్య మాత్రం హిందూపురం ఎమ్మెల్యేగా రాజకీయాల్లో కొనసాగుతూనే ఉన్నారు. ఆ తర్వాత నుంచి వీరిద్దరి మధ్య ఎలాంటి వివాదం చోటు చేసుకోలేదు. ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీ అయిపోయారు.

 

అంతేకాదు.. చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో పొత్తు కుదుర్చుకొని 2024 ఎన్నికల్లో సక్సెస్ అందుకుని డిప్యూటీ సీఎం గా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా, నందమూరి చిత్రాల మధ్య సామ్రస్య‌ పూర్వక సంబంధాలు మొదలయ్యాయి. అంతేకాదు.. ఇటీవల జరిగిన బాలకృష్ణ 50 ఇయర్స్ సెలబ్రేషన్స్‌లో భాగంగా చిరంజీవి.. బాలయ్య పై ప్రశంసల వర్షం కురిపించాడు. పొగడ్తలతో ముంచేసాడు. అంతే కాదు.. బాలయ్యతో కలిసి సినిమా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని.. దర్శకులు కథ సిద్ధం చేసుకోండి అంటూ సవాలు విసిరాడు. అయితే ఇలాంటి క్రమంలో బాలయ్య పద్మభూషణ్ సన్మాన వేడుకల్లో చేసిన కామెంట్స్  నెటింట దుమారంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: