టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. త్రిష ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... మల్లాడి వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ కి , శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ రెండు మూవీలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా వెలువడ్డాయి. కొన్ని రోజుల క్రితమే చిరు , అనిల్ కాంబో మూవీ కి సంబంధించిన అధికారిక లాంచింగ్ కూడా పెద్ద ఎత్తున జరిగింది. అనేక మంది ఈ సినిమా లాంచింగ్ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం చిరు , అనిల్ కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ మే 22 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే చిరు , అనిల్ దర్శకత్వంలో తెరకెక్కకపోయే సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందబోయే సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను శ్రీకాంత్ వేగ వంతంగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈ మూవీలో చిరంజీవికి జోడిగా ఇద్దరు ముద్దుగుమ్మలను ఇప్పటికే శ్రీకాంత్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో రాణి ముఖర్జీ , దీపికా పదుకొనేలను తీసుకోవాలి అనే ఆలోచనలో శ్రీకాంత్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల , నాని హీరోగా రూపొందుతున్న ది ప్యారడైజ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే చిరు తో మూవీ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: