ఈ మధ్యకాలంలో సెలబ్రెటీల లైఫ్ లోకి సంబంధించి కొన్ని రకాల రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. అయితే కొన్ని అందులో నిజం అవుతూ ఉండగా మరికొన్ని చివరికి సెలబ్రిటీలే అవి అబద్దమని ఖండించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత కొద్దిరోజులుగా మెగా కోడలు లావణ్య త్రిపాఠి గర్భంతో ఉందనే విధంగా వార్తలు వినిపించాయి ఎట్టకేలకు మొన్నటి రోజున తల్లితండ్రులు కాబోతున్నామనే విషయాన్ని తెలియజేశారు మెగా కుటుంబ సభ్యులు. ఆ తర్వాత అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ్ల కూడా ప్రెగ్నెంట్ అన్నట్లుగా పలు రకాల రూమర్స్ వినిపించాయి.



అయితే అందుకు తగ్గట్టుగానే ఇటీవలే ముంబైలో జరిగిన వేవ్స్ - 2025  లో శోభిత బదులుగా ఉండే చీరని కట్టుకోవడంతో కచ్చితంగా శోభిత ప్రెగ్నెంట్ అందుకే ఇలా విలువైన దుస్తులు ధరించలేదు అన్నట్లుగా వినిపించాయి. అయితే ఈ విషయం పైన శోభిత టీం క్లారిటీ ఇస్తూ అక్కినేని కోడలు ప్రెగ్నెంట్ అనే విషయం కేవలం వట్టి రూమర్ మాత్రమే అంటూ తెలియజేసింది శోభిత పర్సనల్ లైఫ్ గురించి వినిపిస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని ప్రకటించారు. ప్రస్తుతం శోభిత తన వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నదని.. మాతృత్వం పైన ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదంటూ ఆమెకి తెలియజేసింది.


శోభిత ఇటీవలే వదులుగా ఉండే చీరని ధరించడం పై శోభిత మాట్లాడుతూ అది మెటర్నటీ డ్రెస్ కాబట్టి అలా వేసుకున్నాను కేవలం వస్త్రధారణ వల్ల ఇలాంటి రూమర్స్ రాయడం చాలా ఆశ్చర్యంగా ఉందని తెలియజేసిందట. ఆ తర్వాత తన మీద వస్తున్న ప్రెగ్నెన్సీ రూమర్లను సైతం శోభిత కొట్టి పారేసింది. గత ఏడాది డిసెంబర్లో నాగచైతన్య, శోభిత వివాహం జరిగింది వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న శోభిత సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గానే ఉంటూ అభిమానులతో ముచ్చటించడమే కాకుండా అప్పుడప్పుడు తనకు సంబంధించిన విషయాలను కూడా ప్రకటిస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: