
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కే ఒక కొత్త బయోపిక్ మేడ్ ఇన్ ఇండియాలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. భారతీయ సినిమాకు పితామహుడు అయిన దాదాసాహెబ్ పాల్కే జీవిత కథ ఆధారంగా తెరకెకుతున్న ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి 2023లో అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను మ్యాక్స్ స్టూడియోస్ - షోయింగ్ బిజినెస్ సంస్థలు కలిసి నిర్మిస్తాయి. ఈ కథ విన్నప్పుడే నా మనసు తాకింది ... ఒక బయోపిక్ తీయడం సులభం కాదు .. అది కూడా ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా గురించి కథ అయితే మరింత కష్టమే ... కానీ మా బృందం అందుకు సిద్ధంగా ఉందని కూడా రాజమౌళి తెలిపిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో దాదాసాహెబ్ పాలకే పాత్ర పోషించేందుకు ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది.
నిర్మాతలు వరుణ్ గుప్త - ఎస్ఎస్ కార్తికేయ కలిసి జూనియర్ ఎన్టీఆర్ కు ఈ కథ వినిపించారని సమాచారం. అయితే ఈ సినిమాకు నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. రాజమౌళి పర్యవేక్షణ ఉంటుంది. ఎన్టీఆర్ కథ విన్న వెంటనే ఆకర్షితులయ్యాడని .. దాదాసాహెబ్ ఫాల్కే గురించి తెలియని అనేక విషయాలు ఈ కథలో ఉన్నాయని .. భారతీయ సినిమా అభివృద్ధి గురించి వివరంగా చెప్పడంతో ఎన్టీఆర్ షాక్ అయినట్టు తెలుస్తోంది. అలాగే ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టు చేసేందుకు దర్శకుడు రాజమౌళి , ఆయన కుమారుడు కార్తికేయ , నిర్మాత వరుణ్ గుప్తా పై అభిమానం కూడా ఒక కారణం అంటున్నారు. ఈ ప్రాజెక్టు గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలవడాల్సి ఉంది. ఇప్పటికే ఎన్టీఆర్ - రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ వన్ - సింహాద్రి - యమదొంగ త్రిబుల్ ఆర్ సినిమాలు వచ్చాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు