- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్గా దర్శకుడు ఏ. ఎం జ్యోతి కృష్ణ - జాగర్లమూడి సంయుక్తంగా దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ పీరియడ్ డ్రామా హరిహర వీరమల్లు. ఐదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమా ఎట్టకేలకు ఎన్నో అవంతరాలు ఎదుర్కొని థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇన్ని రోజులు పవన్ అభిమానులలోనే ఈ సినిమాపై కొంచెం అటు ఇటుగా హైప్‌ ఉండేది. సినిమాపై పవన్ అభిమానులకే పెద్దగా నమ్మకాలు ఉండేవి కావు ... అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు పవన్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ ప్రేమికులలో మాత్రమే కాదు .. తెలుగు ప్రజల్లో ఒక రేంజ్ లో హైప్ ఉంది. ఇలాంటి టైంలో వీరమల్లు సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో ఈ సినిమా చాలా ప్రతిష్టాత్మకంగా మారింది.


ఇక హరిహర వీరమల్లు సినిమాపై రోజురోజుకు హైప్‌ బాగా పెరుగుతుంది. ఈ సినిమా రిలీజ్ ను పెద్ద పండగలా జరుపుకోవాలని అందరూ భావిస్తున్నారు. ఏది ఏమైనా హరిహర వీరమల్లు పై నెమ్మది నెమ్మదిగా హైప్‌ పెరుగుతోందని చెప్పాలి. మ‌రి ఈ సినిమా తో ప‌వ‌న్ హిట్ కొడితే ప‌వ‌న్ ఫ్యాన్స్ జోష్ మామూలుగా ఉండ‌దు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: