- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం తన తర్వాత సినిమాను పట్టాలెక్కిం చేందుకు రెడీ అవుతున్నారు. వాస్తవానికి గుంటూరు కారం సినిమా పూర్తయ్యాక ఏడ న్నర పాటు అల్లు అర్జున్తో సినిమా చేసేందుకు త్రివిక్రమ్ ఎదురు చూపులు చూశారు. కానీ పుష్ప 2 ఇండియా రేంజ్ లో సూపర్ డూపర్ హిట్ అయ్యాక బన్నీ తన తర్వాత సినిమాను తమిళ‌ దర్శకుడు అట్లీతో చేస్తున్నాడు. దీంతో త్రివిక్రమ్ తో మూవీ వాయిదా పడింది. ఈ క్రమంలో త్రివిక్రమ్ తన నెక్ట్స్‌ సినిమాను సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాను తనదైన మార్క్ కామెడీ గా తెర‌కెక్కించబోతున్నాడట.


ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా నటిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ అంతకంటే ముందు త్రివిక్రంతో చరణ్ ఓ సినిమా చేస్తాడని .. అదే వెంకటేష్ త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా అని తెలుస్తోంది. దీంతో త్రివిక్రమ్ చేసే సినిమా మల్టీస్టారర్ సినిమా అని .. ఈ సినిమాలో వెంకటేష్ - రామ్ చరణ్ కలిసి నటిస్తారని వార్తలు వస్తున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల సినిమా చేసిన వెంకీ ఇప్పుడు చరణ్తో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: