
ఎన్టీఆర్ గారు ఎలా చనిపోయారు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. కొంతమంది చంద్రబాబు నాయుడు అంటారు కొంతమంది ఆయన భార్య లక్ష్మీపార్వతి అంటారు .. మరి కొంతమంది రకరకాల పేర్లు చెబుతూ నందమూరి తారకరామారావు గారు చనిపోవడానికి కారణం వాళ్లే అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు . కానీ ఇప్పటివరకు ఆయన మరణానికి ఇదే కారణం అంటూ ఎక్కడా కూడా ప్రూఫ్స్ లేవు . కాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా నేడు సోషల్ మీడియాలో హరికృష్ణ మాట్లాడిన ఒక ఓల్డ్ సెన్సేషనల్ వీడియో వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.
ఆ వీడియోలో హరికృష్ణ మాట్లాడుతూ పరోక్షంగా తన తండ్రి చనిపోవడానికి కారణం లక్ష్మీపార్వతినే అంటూ చెప్పుకోరావడం సంచలనంగా మారింది . ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.." 72 ఏళ్లు దాటిన వ్యక్తికి స్టెరాయిడ్స్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ . 72 ఏళ్ల తర్వాత ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన తరువాత.. ఆయనకు మైల్డ్ స్ట్రోక్ వచ్చింది . అలాంటప్పుడు ఆయనకు హెవీడోస్ స్టరాయిడ్స్ ఇవ్వడం కరెక్టేనా..? ఆయినా ఆ టైంలో డాక్టర్ సోరాజు గారిని పిలవకుండా గైనకాలజిస్ట్ డాక్టర్ మహాలక్ష్మి గారిని పిలవడం ఎంతవరకు కరెక్ట్ ..? అప్పటికే సోమరాజు గారు ముందే చెప్పారు . పదినిమిషాలు అండి పది నిమిషాలు మాకు ఆయన ఇస్తే ఆయనని మీక్య్ ప్రాణాలతో తిరిగి ఇస్తామని ..కానీ అది పట్టించుకోకుండా గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ మహాలక్ష్మి గారిని పిలిపించి చికిత్స చేయించడం ఎంతవరకు కరెక్ట్ ..?" అంటూ ఓపెన్ గానే తన తండ్రి మరణానికి కారణం లక్ష్మీపార్వతి అంటూ హరికృష్ణ మాట్లాడిన తీరుకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .
దీంతో సోషల్ మీడియాలో మరొకసారి లక్ష్మీపార్వతిని దుమ్మెత్తి పోస్తున్నారు జనాలు . అసలు ఎన్టీఆర్ చాలా మంచోడు అని .. ఆమెను పెళ్లి చేసుకోకుండా ఉంటే ఇకా ఎక్కువ కాలం బ్రతికి ఉండేవాడు అని .. ఆయన చేసిన తప్పు ఆమెను పెళ్లి చేసుకోవడమే అంటూ మాట్లాడుతున్నారు. చాలామంది హీరోయిన్స్ తో నటించాడు.. ఏ హీరోయిన్ విషయంలో కనెక్ట్ అవ్వని ఎన్టీఆర్ ఆమెకు మాత్రమే ఎలా కనెక్ట్ అయ్యాడు..? దీని వెనక ఏదో పెద్ద కుట్రే ఉంది . కావాలనే ఆయనని టార్గెట్ చేసి ఈ విధంగా హతమార్చారు అంటూ నందమూరి అభిమానులు ఘాటుగా స్పందిస్తున్నారు..!