
ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా లలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ సినిమా “ హరిహర వీరమల్లు ”. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి అలాగే ఈ సినిమా నిర్మాత ఏఎం. రత్నం తనయుడు జ్యోతి కృష్ణ కలిసి సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ కం పీరియాడిక్ డ్రామా కోసం అభిమానులు ఓ రేంజ్ లో ఎంతో ఆసక్తి తో వెయిట్ చూస్తున్నారు. అయితే ఈ సినిమా కి తెలంగాణ లో స్పెషల్ పర్మిషన్స్ కోసం అధికారిక క్లారిటీ ఒకటి బయటకి వచ్చింది.
తెలంగాణ లో వీరమల్లు సినిమా కోసం టిక్కెట్ రేట్ల హైక్ తో పాటు అదనపు షోల కోసం నిర్మాత ఏఎం. రత్నం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. నైజాం లో కూడా ఈ సినిమా రిలీజ్ రోజు అయిన జూన్ 12వ తేదీ ఉదయం 4 గంటలు నుంచే షోలు పడే లా పర్మిసన్లు ఉండబోతున్నాయట. అలాగే టిక్కెట్ రేట్ల హైక్ కూడా ఉంటుందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇక ఈ భారీ పీరియాడికల్ సినిమా కు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మెగా శ్రీ సూర్య ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కే ఈ సినిమా రు. 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు