సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ఎంట్రీ ఇస్తూ ఉంటారు అలాంటి వారిలో కొంత మంది కి కెరియర్ ప్రారంభంలో పెద్ద స్థాయిలో గుర్తింపు రాకపోయినా ఒకే ఒక సినిమాతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించుకునే ముద్దుగుమ్మలు కూడా ఉంటారు. అలాంటి వారిలో తృప్తి డిమ్రి ఒకరు. ఈ ముద్దుగుమ్మ తన కెరీర్లో చాలా సినిమాల్లో నటించింది. కానీ వాటి ద్వారా ఈమెకు పెద్ద స్థాయిలో గుర్తింపు రాలేదు. కొంత కాలం క్రితం ఈ బ్యూటీ బాలీవుడ్ స్టార్ నటుడు రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సందీప్ రెడ్డి బంగారు దర్శకత్వంలో రూపొందిన యానిమల్ మూవీ లో నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం , ఇందులో ఈ బ్యూటీ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు ఇండియా వ్యాప్తంగా వచ్చింది. ఆ తర్వాత నుండి ఈమెకు అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అనేక క్రేజీ సినిమాలు ఉన్నాయి. మరి ప్రస్తుతం తృప్తి డిమ్రి చేతిలో ఏ సినిమాలు ఉన్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

ప్రస్తుతం ఈ బ్యూటీ ధడక్ 2 అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ పై హిందీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే షాహిద్ కపూర్ హీరో గా రూపొందుతున్న ఓ సినిమాలో కూడా ఈ బ్యూటీ హీరోయిన్గా నటిస్తుంది. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి 100 దర్శకత్వంలో రూపొందబోయే స్పిరిట్ సినిమాలో కూడా ఈ బ్యూటీ హీరోయిన్గా నటించబోతోంది. అలాగే పహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో రూపొందబోయే ఓ సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా నటించబోతుంది. ఇలా ఈ బ్యూటీ ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో నటిస్తూ అద్భుతమైన రీతిలో కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Td