అక్కినేని అఖిల్ జైనబ్ ల వివాహం హైదరాబాదులోని అక్కినేని నాగార్జున ఇంట్లో అట్టహాసంగా జరిగింది. వీరి పెళ్లి నిన్న అనగా జూన్ 6న ఉదయం 3:30 గంటలకే జరిగింది.ఇక ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీలోని కొంతమంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇక అన్నపూర్ణ స్టూడియోలో జూన్ 8న జరిగే రిసెప్షన్ వేడుకకి భారీగా సెలబ్రిటీలు,రాజకీయ నాయకులు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, బిజినెస్ మాన్ లు తరలి రాబోతున్నట్లు తెలుస్తోంది.అయితే పెళ్లి సింపుల్గా చేసినప్పటికీ రిసెప్షన్ మాత్రం గ్రాండ్గా చేయడంతో రిసెప్షన్ కి చాలామంది హాజరవుతున్నట్టు సమాచారం. అయితే ఈ విషయం పక్కన పెడితే అఖిల్ జైనబ్ ని పెళ్లి చేసుకోవడంతో ఆయన ఆస్తులు అమాంతం పెరిగిపోయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే జైనబ్ రావడ్జి ఫ్యామిలీ కి పెద్ద పెద్ద బిజినెస్ లు విదేశాలలో కూడా ఉన్నాయి. 

అలా టాప్ బిజినెస్ మాన్ లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న జుల్ఫీ రావడ్జి ఒక్కగానొక్క కూతురు జైనబ్ రావడ్జి..అలాగే జైనబ్ కి ఓ సోదరుడు కూడా ఉన్నారు.. ఇక ఎన్ని ఆస్తులు ఉన్నా కూడా వీళ్ళిద్దరికీ సమానమే.. కాబట్టి జైనబ్ కి తండ్రి తరఫున ఆస్తులు వేలకోట్లలో రాబోతున్నట్టు తెలుస్తోంది.అలాగే జైనబ్ తండ్రి బాటలో నడవకుండా డిఫరెంట్ రంగాన్ని ఎంచుకొని యాక్ట్రెస్ గా పెయింటింగ్ కళాకారిణిగా రాణిస్తోంది. అలా డిఫరెంట్ రంగంలో రాణిస్తూ ఆమె కూడా కోట్లు సంపాదిస్తూ తన కాళ్లపై తాను నిలబడుతుంది.అయితే తాజాగా అఖిల్ ని పెళ్లి చేసుకోవడంతో అక్కినేని అఖిల్ కి తండ్రి తరుపున వచ్చే ఆస్తులతో పాటు భార్య తీసుకువచ్చే ఆస్తులు అన్ని కలగలిపి టాలీవుడ్ లోనే రిచెస్ట్ హీరోలలో ఒకరయ్యారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నాగార్జునకి కూడా వేలకోట్ల ఆస్తులు ఉన్నాయి.

ఈయనకు వేల ఎకరాల భూములతో పాటు అన్నపూర్ణ స్టూడియో వంటి భారీ ఆదాయం వచ్చే స్టూడియో కూడా ఉంది.  అలాగే పలు బిజినెస్ లు కూడా ఉన్నాయి. అలా నాగార్జున ఆస్తులు ఇద్దరు కొడుకులకు సరి సమానం కాబట్టి అక్కినేని అఖిల్ కి నాగార్జున ఆస్తి నుండి దాదాపు 2000 కోట్ల వరకు వస్తాయి.అలాగే అఖిల్ కూడా కొంత డబ్బుని సంపాదించారు.ఇక అమల పుట్టింటి నుండి వచ్చే ఆస్తులు ఆమె చేసే బిజినెస్లు అఖిల్ కే సొంతం కాబట్టి అలా అటు జైనబ్ రావడ్జి ఇటు నాగార్జున,తల్లి అమల,అఖిల్ ఇలా అందరివి కలగలిపి అక్కినేని అఖిల్ ఆస్తి అమాంతం పెరిగిపోయిందని,టాలీవుడ్ లో ఉన్న యంగ్ రిచెస్ట్ హీరోలలో అఖిల్ మొట్టమొదటి ప్లేస్ లో ఉంటారు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: