
అయితే ఈ చిత్రంలో చాలా పాత్రలను కూడా అదనంగా యాడ్ చేయబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇందులో మేల్, ఫిమేల్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందట. ముఖ్యంగా ఇందులో ఒక లేడీ హీరోయిన్ రంగంలోకి దింపబోతున్నట్లు కోలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. హీరోయిన్ అనుష్క శెట్టి ని లేడీ డాన్ పాత్రలో చూపించబోతున్నట్లు ప్రచారమైతే జరుగుతోంది .ఒకవేళ ఇదే కనుక నిజమైతే డైరెక్టర్ లోకేష్ ప్లాన్ కి తిరిగి ఉండదని చెప్పవచ్చు. ఖైదీ 2 సినిమా పైన భారీగా అంచనాలు పెరిగిపోతాయి.
గతంలో కూడా డాన్ గర్ల్ ఫ్రెండ్ గా నటించిన అనుభవం హీరోయిన్ అనుష్క శెట్టికి ఉన్నది.. బిల్ల సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న అనుష్క శెట్టి ఇప్పుడు అలాంటి తరహా పాత్రలో కనిపించబోతోంది. మరి లోకేష్ కనకరాజు ఈ సినిమాలో అనుష్క పాత్ర డోస్ పెంచి మరి చూపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈమె పాత్ర చాలా రగ్గడ్గా రఫ్ గా ఉంటుందని ఇందుకోసం డైరెక్టర్ లోకేష్ కనకరాజు కూడా ఎక్కడ రాజీ పడకుండా దీటుగా అవుట్ ఫుట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. మరి ఖైదీ 2 కోసం అనుష్క శెట్టి ఓకే చెబితే మరి ఏ విధంగా కష్టపడుతుందో చూడాలి మరి. అన్నీ కుదిరితే అనుష్క కెరీర్ కి ఒక టర్నింగ్ పాయింట్ ఈ సినిమా అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.