
సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కచ్చితంగా వావ్..వారెవ్వా అనాల్సిందే . అంత చక్కగా తెరకెక్కించాడు శేఖర్ కమ్ముల. మరీ ముఖ్యంగా ధనుష్ పెర్ఫార్మన్స్ అయితే టూ గుడ్.. ఇప్పటివరకు ఆయన కెరియర్ లో ఇలాంటి ఒక పర్ఫామెన్స్ ఇవ్వలేదు అని చెప్పడంలో సందేహమే లేదు అంటున్నారు అభిమానులు. కేవలం తెలుగులోనే కాదు రిలీజ్ అయిన అన్ని భాషలలోనూ కుబేర సినిమా పాజిటివ్ టాక్ అందుకుంది . మరీ ముఖ్యంగా ఈ కుబేర సినిమా పూర్తి సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కింది. సినిమా చూసిన జనాలు కూడా అదే చెప్పుతున్నారు.
సెంటిమెంట్ పరంగా సినిమాలు చూసేవాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది అని.. యాక్షన్ సీన్స్ .. రొమాంటిక్ సీన్స్ ..ఇంకేదో ఎక్స్ పెక్ట్ చేసి వెళ్లితే కుబేర సినిమా నచ్చకపోవచ్చు అని వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు . కొంతమంది దీని నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయిన సినిమా రులీజ్ అయ్యాక ఇలాంటి ట్రోలింగ్ బాధలు తప్పవు అంటున్నారు జనాలు. కాగా శేఖర్ కమ్ముల మాత్రం చాలా చాలా చక్కగా కధ రాసుకున్నారని .. ఎవరికీ ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో స్టోరీలో అంతే ఇంపార్టెన్స్ ఇచ్చారు అని.. సినిమా టాక్ ని ఓ రేంజ్ లో వైరల్ చేసేస్తున్నారు . మొత్తానికి శేఖర్ కమ్ముల ఈజ్ బ్యాక్ అని అనిపించుకున్నాడు . కుబేర సినిమా సూపర్ డూపర్ హిట్ . అందులో నో డౌట్ ..మరి మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..? తెలియాలి అంటే మరి కొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే...!??