సినిమా ఇండస్ట్రీ లో విజయాలు ఉన్న హీరోయిన్లకే అద్భుతమైన అవకాశాలు దక్కుతాయి అని చాలా మంది అభిప్రాయ పడుతూ ఉంటారు. కానీ కొంత మంది విషయంలో ఇది రాంగ్ అని కూడా ప్రూవ్ అయిన సందర్భాలు ఉన్నాయి. విజయాలు లేకపోయినా అద్భుతమైన స్టార్ ఈమేజ్ ఉన్న హీరోల సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటూ అద్భుతమైన రేంజ్ లో కెరియర్ను ముందుకు సాగించిన బ్యూటీలలో అను ఇమన్యుయల్ ఒకరు. ఈమె 2016 వ సంవత్సరం విడుదల అయిన మజ్ను అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. నాని ఈ సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ తో ఈమె మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాతో ఈమెకు అద్భుతమైన గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. ఇక ఆ తర్వాత ఈమెకు వరుస పెట్టి తెలుగు సినిమాలలో అవకాశాలు కూడా దక్కాయి. మజ్ను సినిమా తర్వాత ఈమె తెలుగులో కిట్టు ఉన్నాడు జాగ్రత్త , ఆక్సిజన్ , అజ్ఞాతవాసి , నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ,  శైలజ రెడ్డి అల్లుడు , అల్లుడు అదుర్స్ ,  మహా సముద్రం , ఊర్వశివో రాక్షసివో , రావణాసుర సినిమాలలో నటించింది. ఈ సినిమాలలో ఏ సినిమా కూడా విజయాన్ని సాధించలేదు. అయిన కూడా ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ఉంది. దానితో చాలా మంది ఈమెకు విజయాలు లేకపోయినా యూత్ ఆడియన్స్ లో అద్భుతమైన క్రేజ్ ఉంది. 

ఈమెకు ఒక్క బ్లాక్ బాస్టర్ విజయం దక్కిన మళ్ళీ ఈమె అదిరిపోయే రేంజ్ అవకాశాలను దక్కించుకుంటుంది. తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన స్థాయికి చేరుకుంటుంది అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ బ్యూటీ ఆఖరుగా కార్తీ హీరోగా రూపొందిన జపాన్ అనే తమిళ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ప్రస్తుతం మాత్రం ఈమె చేతిలో పెద్దగా సినిమాలు ఏవి లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: