కొంత మంది హీరోలు వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సమయంలో ఒక సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది అంటే మరో సినిమా షూటింగ్ను స్టార్ట్ చేసి దీనిపై ఫుల్ ఫోకస్ పెడుతూ ఉంటారు. దానితో మొదట పూర్తి చేసిన సినిమాకు సంబంధించిన పనులను దాదాపుగా దర్శకులు, నిర్మాతలు, నటీనటులు చూసుకుంటూ ఉంటారు. అలాగే ఒక వేళ హీరో కనుక చాలా బిజీగా ఉన్నట్లయితే ప్రమోషన్లలో కూడా ఎక్కువ శాతం పాల్గొనే అవకాశం ఉండదు.

కానీ ఓ స్టార్ హీరో మాత్రం వరస సినిమాలతో చాలా బిజీగా ఉండి , పొలిటికల్ పనులతో అత్యంత బిజీగా ఉన్నా కూడా తన సినిమా పనులను అత్యంత సీరియస్గా తీసుకొని ప్రతి విషయంలో జోక్యం చేసుకొని సినిమాలను ముందుకు తీసుకు వెళుతున్నాడు. ఇంతకు ఆయన ఎవరు అనుకుంటున్నారా ..? ఆయన మరెవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరో మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితం హరిహర వీరమల్లు , ఓజి , ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీలను మొదలు పెట్టాడు. ఈ మూవీలు స్టార్ట్ అయిన తర్వాత పవన్ రాజకీయ పనులతో చాలా బిజీ అయ్యాడు. దానితో ఈ మూడు సినిమాలను పక్కన పెట్టి రాజకీయాలపై దృష్టి పెట్టాడు. ఇక రాజకీయాల్లో అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయిన తర్వాత కమిట్ అయిన ఈ మూడు సినిమాలపై పవన్ దృష్టి పెట్టాడు. అందులో భాగంగా ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమాను పూర్తి చేశాడు. ఓజి , ఉత్సద్ భగత్ సింగ్ మూవీలను ప్రస్తుతం పూర్తి చేస్తున్నాడు.

హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ను తాజాగా పవన్ చూసి అద్భుతంగా ఉంది అని దర్శకుడిని , మూవీ యూనిట్ ని అభినందించినట్లు ఓ వీడియో కూడా బయటకు వచ్చింది. ఓజి సినిమాకు సంబంధించిన ఫస్టాఫ్ ను చూసి దర్శకుడిని అభినందించినట్లు తెలుస్తోంది. ఇలా పవన్ రాజకీయ పనులతో బిజీగా ఉన్న తాను చేస్తున్న సినిమాల గురించి చాలా బాగా పట్టించుకుంటూ ఉండటంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: