టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోల రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న అతి కొద్ద మంది నటీమణులలో అనుష్క శెట్టి ఒకరు. ఈమె నాగార్జున హీరోగా రూపొందిన సూపర్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ లో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దానితో ఆ తర్వాత నుండి ఈమెకు వరస పెట్టి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కడం మొదలు అయింది. ఈమె ఎన్నో విజయాలను అందుకొని తెలుగులో స్టార్ హీరోయిన్ క్రేజ్ను సంపాదించుకుంది.

కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో గ్లామర్ పాత్రలలో నటించి అంద చందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అనుష్క ఈ మధ్య కాలంలో మాత్రం ఎక్కువ శాతం తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో , అలాగే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించడానికి చాలా ఆసక్తిని చూపిస్తుంది. ప్రస్తుతం అనుష్క , క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఘాటి అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కొంత కాలం క్రితమే స్టార్ట్ అయింది. ఈ సినిమాను ఈ నెల 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు. గత కొంత కాలంగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి. ఈ మూవీని ఈ నెల 11 వ తేదీన విడుదల కావడం కష్టం అని , ఈ సినిమా విడుదల వాయిదా పడబోతుంది అని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ మూవీ బృందం అధికారికంగా ఈ సినిమాను విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. 

తాజాగా ఈ మూవీ యూనిట్ ప్రేక్షకులకు అద్భుతమైన , ఉత్తమ సినిమాటిక్ అనుభవాన్ని పంచేందుకు మూవీ విడుదలను వాయిదా వేస్తున్నాం. త్వరలోనే సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

As