అందరూ ఎప్పుడెప్పుడా అని అనుకుంటున్న ప్రభాస్ పెళ్లి గడియలు రానే వచ్చాయా.. ప్రభాస్ పెళ్లికి ముహూర్తం కుదిరిందా? త్వరలోనే ప్రభాస్ ఆమె మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నారా..ఇంతకీ ప్రభాస్ పెళ్ళంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడానికి కారణం ఏంటి..ప్రభాస్ పెద్దమ్మ పూజల సంగతేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అభిమానులందరూ ప్రభాస్ పెళ్లి ఎప్పుడెప్పుడా అని ఆవురావురుమంటూ ఎదురు చూస్తున్నారు. ఆయన పెళ్లి చేసుకుంటే వేయి కళ్ళతో చూద్దామని ఎదురు చూస్తున్న అభిమానులకి ప్రతిసారి షాక్ తగులుతూ వస్తుంది. అయితే ప్రతి సంవత్సరం ఈ ఏడాది చివర్లోకెళ్లా ప్రభాస్ పెళ్లి అనే వార్తలు చూసి చూసి అభిమానులకు కూడా బోర్ కొట్టేసిందేమో.. ఈ మధ్యకాలంలో ప్రభాస్ పెళ్లి గురించి పట్టించుకోవడమే మానేశారు..

 ఇక రీసెంట్ గా కన్నప్ప మూవీ లో ప్రభాస్ పెళ్లి డైలాగ్ ఒకటి ఉంటుంది.ఆ పెళ్లి డైలాగ్ నెట్టింట వైరల్ గా మారడంతో మరోసారి ప్రభాస్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినిపిస్తోంది.అదేంటంటే..ప్రభాస్ పెద్దమ్మ తాజాగా ఓ గుడిలో ప్రభాస్ పేరు మీద ప్రత్యేక పూజలు చేయించింది. ఇక ఈ పూజలు చేస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారడంతో ప్రభాస్ పెళ్లి గురించి ఒక ఆసక్తికరమైన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఇక విషయంలోకి వెళ్తే.. ప్రభాస్ పెద్దమ్మ దివంగత నటుడు కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో ఉండే ఫేమస్ టెంపుల్ అయినటువంటి కాకినాడలోని తుని లో ఉండే పవర్ఫుల్ అమ్మవారు అయినటువంటి తలుపులమ్మవారి గుడిలో కనిపించారు.

ఈ గుడిలో శ్యామలా దేవి మొక్కులు చెల్లించి ప్రభాస్ పేరు మీద స్పెషల్ గా కుంకుమార్చన కూడా చేయించిందట. అయితే దానికి సంబంధించిన విషయం ఫోటోలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారడంతో చాలామంది నెటిజన్లు ప్రభాస్ పెళ్లి గురించే శ్యామలా దేవి అలా తలుపులమ్మ దేవి ఆలయంలో పూజలు చేసి ప్రభాస్ పేరు మీద కుంకుమార్చన చేయించింది అని మాట్లాడుకుంటున్నారు. ఇక మరికొంత మందేమో త్వరలోనే శ్రావణమాసం కాబట్టి మంచి ముహూర్తాలు రాబోతున్నాయి.ఇక నెక్స్ట్ మంత్ ప్రభాస్ కి పెళ్లి చేయాలని శ్యామలా దేవి ఫిక్స్ అయినట్టుంది. అందుకే ఆషాడం లోనే ప్రభాస్ పెద్దమ్మ మొక్కులు చెల్లించుకుంటుంది అంటూ మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: