"అల్లు అర్జున్".. సినిమాకి సంబంధించిన లేటెస్ట్ మూవీ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ట్రాక్ రికార్డ్ చూసి ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు అభిమానులు . తన22వ సినిమాను అట్లీకి చేసే ఛాన్స్ ఇచ్చి అల్లు అర్జున్ ఇంకా తన పేరుని హైలెట్ అయ్యేలా చేసుకున్నాడు.  అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 8వ తేదీ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియో రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటించారు.


అంతర్జాతీయ స్థాయిలో పలు సినిమాలను సినిమాలకు పనిచేసిన విఎఫ్ఎక్స్ కంపెనీలు కూడా ఈ సినిమా కోసం వర్క్ చూస్తున్నాయి అంటూ తెలుస్తుంది . అంతేకాదు దీనికి తోడు కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమాను భారీ బడ్జెట్లో నిర్మిస్తూ ఉండడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్గా నటిస్తుంది.  దీనికి సంబంధించిన వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది . అయితే ఇప్పుడు ఈ సినిమాలో విలన్ గా హాలీవుడ్ హీరో నటించబోతున్నాడు అన్న వార్త సినిమా రేంజ్ ని వేరే లెవెల్ లో పెంచేసింది.



ధోర్, ఎక్స్ట్రాక్షన్ వంటి చిత్రాలతో ఆకట్టుకున్న హాలీవుడ్ హీరో క్రిస్ హెమ్యూర్  తో పాటు హాలీవుడ్ టాప్ హీరో "విల్ స్మిత్" ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు అన్న న్యూస్ తెరపైకి వచ్చింది. విల్ స్మిత్ ఈ సినిమాలో అల్లు అర్జున్ కి నెగిటివ్ క్యారెక్టర్ లో నటించబోతున్నారట.  తొలిసారి ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయెల్ రోల్ చేస్తున్నట్లు కూడా న్యూస్ బయటకు వచ్చింది . దీంతో సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . ఆస్కార్ అవార్డ్ విన్నర్ నే విలన్ గా చూపించడానికి అట్లీ తీసుకున్న డేరింగ్ డెసిషన్ ఇండస్ట్రీలో ప్రముఖుల చేత శభాష్ అనిపించేలా చేస్తుంది. అలాగే మృణాల్  ఠాకూర్ కూడా ఈ సినిమాల కీలకపాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. స్పైడర్ మాన్, అవెంజర్స్ , మార్వెల్స్ , వండర్ విమెన్ చేసిన టాప్ టెక్నీషియన్లు ఈ మూవీకి పనిచేస్తున్నట్లు వార్తలు ట్రెండ్ అవుతున్నాయ్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: