రజినీకాంత్ సినిమాలో ఐదు నిమిషాలు కనిపించినా చాలు అని చాలామంది హీరోలు అనుకుంటారు.ఎందుకంటే రజినీకాంత్ కి ఉన్న క్రేజ్ అలాంటిది.. ఆయన సినిమాలో నటిస్తే మా సినిమా పెద్ద హిట్ అవుతుంది అని ఎంతోమంది హీరోలు నమ్ముతారు. అయితే అప్పుడప్పుడు స్టార్ హీరోల గెస్ట్ రోల్స్ కూడా సినిమాకి మైనస్ గా మారుతూ ఉంటాయి. అయితే అలా రజినీకాంత్ వల్ల కూడా మా సినిమాకి మైనస్ అయింది అంటూ ఓ హీరో షాకింగ్ కామెంట్స్ చేశారు. మరి ఇంతకీ రజినీకాంత్ వల్లని సినిమా ఫ్లాఫ్ అయింది అంటూ చెప్పిన ఆ హీరో ఎవరయ్యా అంటే తమిళనటుడు విష్ణు విశాల్.. రజినీకాంత్,విష్ణు విశాల్, విక్రాంత్ లు కలిసి లాల్ సలాం సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. రజినీకాంత్ కూతురు ఐశ్వర్యా రజినీకాంత్ దర్శకత్వం వహించిన లాల్ సలాం మూవీలో మొదట రజినీకాంత్ ని ఓ 25 నిమిషాల పాటు కెమియో రోల్ కోసం అనుకున్నారట. 

అయితే అంతా బాగానే ఉన్నప్పటికీ రజినీకాంత్  ఎంట్రీ ఇచ్చాక స్క్రిప్ట్ మొత్తం మార్చేశారట. ఆయనని కేమియో రోల్ కోసం తీసుకోవాలని నిర్ణయించుకొని చివరికి పూర్తిగా చూపించడంతో సినిమా ప్లాఫ్ అయింది అంటూ విష్ణు విశాల్ తాజా ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.. అంతేకాదు ఈ సినిమాలో మెయిన్ లీడ్ నాదని, కానీ రజినీకాంత్ ఎంట్రీ ఇవ్వడం వల్ల నన్ను మెయిన్ లీడ్ గా తీసేసి స్క్రిప్ట్ మొత్తం మార్చేశారని అందుకే సినిమా అతిపెద్ద ప్లాఫ్ అయింది అంటూ విష్ణు విశాల్  చెప్పుకొచ్చారు. అంతేకాదు రజినీకాంత్ సినిమాలో ఉంటే హిట్ అవుతుందని చాలామంది అనుకుంటారు. మేం కూడా మా సినిమాకి రజినీకాంత్ వల్ల ఫ్లాప్ అవుతుంది అనుకున్నాం. కానీ చివరికి రిజల్ట్ తేడా కొట్టింది.రజినీకాంత్ వల్లే సినిమా ప్లాఫ్ అయ్యింది. అయితే రజినీకాంత్ అంటే నాకు కూడా ఇష్టమే.ఆయన సినిమాలో నటించాలని నేను కూడా అనుకుంటాను.

 కానీ ఆయన నటించడం వల్లే సినిమా ప్లాఫ్ అయింది. కెమియో రోల్ కాస్త పూర్తిగా చూపించే సరికి స్క్రిప్ట్ సెట్ అవ్వక సినిమా డిజాస్టర్ అయింది. ఇక ఈ సినిమాని థియేటర్లో ఎవరూ చూడలేదు. దానికి కొన్ని మార్పులు చేర్పులు చేసి ఓటిటిలో రిలీజ్ చేసినా కూడా అక్కడ కూడా ప్రేక్షకులు పట్టించుకోలేదు.దాంతో నిర్మాతకి నష్టాలు వచ్చాయి అంటూ విష్ణు విశాల్  చెప్పుకొచ్చారు. ఇక విష్ణు విశాల్ నటించిన తాజా మూవీ ఓహో ఎంథన్ బేబీ జూలై 11న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా లాల్ సలాం సినిమాపై ఇలాంటి కామెంట్లు చేశారు.అలాగే విష్ణు విశాల్ నటించిన రాక్షసన్ మూవీకి సీక్వెల్ గా రాక్షసన్-2  కూడా ఉంటుందని ప్రకటించారు. ఇక ఈ రాక్షసన్ మూవీని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు అనే టైటిల్ తో రీమేక్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: