
టాలీవుడ్లో విభిన్నమైన నటుడుగా పేరు సంపాదించిన సందీప్ కిషన్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు.. చివరిగా మజాకా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పరవాలేదు అనిపించుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్లో సందీప్ కిషన్ చేసిన కామెంట్స్ చాలా వైరల్ గా మారాయి. ఎన్నో సూపర్ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన సందీప్ కిషన్ సినిమా రిసల్ట్ ఎలా ఉన్నా కూడా వాటిని పట్టించుకోరు. సందీప్ కిషన్ సైనస్ అనే సమస్యతో ఇబ్బంది పడుతున్నారట. సినిమా షూటింగ్లో గ్యాప్ దొరికితే చాలు కార్ వ్యాన్లో వెళ్లి మరి నిద్రపోతానని తెలియజేశారు.
అయితే నిద్ర పోయిన తర్వాత తన ముక్కు నుంచి తన వెనుక భాగం వరకు బ్లాక్ అవుతుందని అలాగే ఉదయాన్నే లేవగానే తాను ఎవరితో మాట్లాడానని.. ముందుగా ఒక వేడి టీ తాగి, మెడిటేషన్ చేసి ,పాటలు వింటూ ఆ తర్వాత మాట్లాడతానని తెలిపారు. ఇది నయం కావాలి అంటే సర్జరీ చేయించుకోవాలని చెప్పారు ఆపరేషన్ చేయించుకుంటే ముక్కు మారిపోతుంది ముఖం మారిపోతుందని భయంతో వాటి దగ్గరికి వెళ్లలేదంటూ తెలిపారు హీరో సందీప్ కిషన్.అలాగే నెల రోజులపాటు సినిమా షూటింగ్ కి కూడా గ్యాప్ తీసుకోవాలి లేకపోతే ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా కష్టంగానే ఉంటుంది అంటూ తెలిపారు హీరో సందీప్ కిషన్. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కేవలం అభిమానుల కోసమే సినిమాలు చేస్తున్నారు.