
అయితే తమన్నా ఎప్పుడు కూడా తన సినీ కెరియర్ లో ఇంత కావాలని డిమాండ్ నిర్మాతలను చేయకపోవడం వల్లే ఈమెకు చాలా అవకాశాలు వస్తున్నాయనే విధంగా వినిపిస్తున్నాయి. తమన్నా గురించి ఏ భాషలో కూడా ఎలాంటి వివాదాలు ఇప్పటివరకు వినిపించలేదు. ఈ విషయంలో తమన్నాను ఒప్పుకోవాల్సిందే.. ఇంతటి లాంగ్ కెరియర్ సాధ్యం కావడానికి కేవలం ఇమేజ్ ఒకటే కాదు వ్యక్తిగత విషయాలలో కూడా కఠినమైన నిర్ణయాలను పాటిస్తేనే సాధ్యమవుతుంది. రెమ్యూనరేషన్ విషయంలో తమన్నా నిర్మాతల్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టదనే విషయం ఇప్పుడు వినిపిస్తోంది.
తన రెమ్యూనరేషన్ ప్రస్తుతం ఉన్న మార్కెట్ కు ఆధారంగానే చెల్లించాలని తెలియజేస్తుందట. అంతకుమించి తనకు ఏ ఒక్క రూపాయి కూడా అదనంగా అవసరం లేదని తెగేసి చెప్పేస్తుందట. అలాగే తన నుంచి ఎలాంటి అదనపు ఖర్చులను కూడా నిర్మాతలపైన వేయకుండా సెట్స్ కు వచ్చిన తర్వాత తన ఖర్చులను తానే భరిస్తుందట తమన్నా. ఒకవేళ నిర్మాతలు ఇస్తానన్నా కూడా వద్దంటుందట తమన్నా. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో రావలసిన డబ్బులను ముక్కుపిండి మరి వసూలు చేస్తున్న సెలబ్రిటీలు ఉన్న పరిస్థితులలో తమన్నా చేస్తున్న పనికి అభిమానులు ప్రశంసిస్తున్నారు. మరి తమన్నా లాగా అందరు కూడా పాటిస్తే నిర్మాతలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని వాదన ఇప్పుడు వినిపిస్తోంది.