
పూజ హెగ్డే సాంగ్ ని లాంఛ్ చేశారు మూవీ మేకర్స్. హైలైట్ ఏంటంటే ఇందులో రజనీకాంత్ - నాగార్జున ఎక్కడ కనిపించలేదు . మలయాళ ఆర్టిస్ట్ సౌబిన్ షాహిద్ హుషారుగా డాన్స్ చేయడం మాత్రం ఫ్యాన్స్ కి ఓ రేంజ్ లో కిక్ ఎక్కించింది. అనిరుధ్ రవిచంద్రన్ ఎప్పటిలాగే క్రేజీ ట్యూన్ కంపోజ్ చేశాడు. వినగానే ఈ పాట బాడీలో మెలికలు తిరిపోయేలా ఫీలింగ్స్ కలగజేసేస్తూ ఉంటుంది . ఇది ఒక స్లో పాయిజన్ లా ఆకట్టుకుంటుంది . మెయిన్ క్యాస్టింగ్ లేకుండా పూజ హెగ్డే ఇలాంటి టాప్ హీరోయిన్ ని పెట్టుకొని ఈ పాటను చిత్రీకరించడం లోకేష్ కనగరాజ్ వల్ల సాధ్యమవుతుంది అంటూ తెగ పొగిడేస్తున్నారు కోలీవుడ్ జనాలు .
మౌనిక సాంగ్ చార్త్ బసటర్ కావడం ఖాయం అంటున్నారు అభిమానులు. అసలైన వీడియో కంటెంట్ దాచుకొని ఇలా పాటలతో హైప్ ఎక్కించడంలో లోకేష్ కనగరాజ్ తర్వాతే ఎవరైనా అంటున్నారు . ఆ విషయంలో అనిరుధ్.. వందకి 100% మార్కులు కొట్టేశారు అంటున్నారు . ఒకపక్క వార్ 2 సినిమా మరొక పక్క కూలి సినిమా ఒకే తేదీన రిలీజ్ కాబోతున్నాయి . టఫ్ కాంపిటీషన్ అనే చెప్పాలి . కానీ వార్ 2 నుంచి ఎక్కడా కూడా సరైన అప్డేట్ రావడం లేదు. కూలి సినిమా మాత్రం మంచిగా ప్రమోషన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. రజనీకాంత్ హెర్బల్ కూలిగా నటిస్తున్న ఈ గ్యాంగ్ స్టార్ మూవీలో నాగార్జున విలన్ గా నటిస్తుండగా ఉపేంద్ర, అమీర్ ఖాన్ ప్రత్యేక పాత్రలు పోషించారు . చెన్నై మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు కూలి ట్రైలర్ లేకుండానే డైరెక్ట్ గా థియేటర్ రిలీజ్ లో రిలీజ్ అయిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఒకే ఒక్క మౌనిక సాంగ్ తో కావలసినంత బజ్ క్రియేట్ చేసుకునేది కూలి సినిమా . ఈ సినిమా 1000 కోట్ల గ్రాస్ రాబడుతుంది అంటూ ముందు నుంచి తమిళ ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారు . మౌనిక పాట చూసిన తర్వాత అందరికీ అదే నిజం అనిపిస్తుంది . చూడాలి మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో..???