కోట శ్రీనివాసరావు మరణంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది.తెలుగు సినిమా ఇండస్ట్రీకి విశేష సేవలు అందించిన కోట శ్రీనివాసరావు మరణించడం నిజంగా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఇక ఈరోజు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు జరగబోతున్నాయి. ప్రస్తుతం ప్రముఖుల సందర్శనార్థం కోట శ్రీనివాసరావు భౌతిక కాయాన్ని ఆయన నివాసంలోనే ఉంచారు.అయితే అలాంటి కోటా మరణంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక దిగ్గజ నటుడిని కోల్పోయింది అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.ఈ నేపథ్యంలోనే కోట శ్రీనివాస్ రావు కు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇందులో భాగంగా కోటా శ్రీనివాసరావుకి ఓసారి షూటింగ్ సెట్లోనే మెగాస్టార్ చిరంజీవి వార్నింగ్ ఇచ్చారట.

మరి కోట శ్రీనివాసరావు చేసిన తప్పేంటి..మెగాస్టార్ తనకంటే వయసులో పెద్దవాడైన కోట శ్రీనివాసరావుకి ఎందుకు వార్నింగ్ ఇచ్చారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. చిరంజీవి నటించిన ఎన్నో సినిమాల్లో కూడా శ్రీనివాసరావు విలన్ గా.. కామెడీ విలన్ గా..నటించిన సంగతి మనకు తెలిసిందే.అయితే కోటా శ్రీనివాసరావుకి మద్యం అలవాటు ఉంటుంది అని చాలామంది ఆయనతో నటించిన వారు ఉంటారు. ముఖ్యంగా కోట శ్రీనివాసరావు కొడుకు ఎప్పుడైతే మరణించారో అప్పటినుండి ఆయన చాలా డిప్రెషన్ లోకి వెళ్లి ఎక్కువగా మద్యానికి అలవాటు పడ్డారట. అలా చిరంజీవి సినిమా చేస్తున్న సమయంలో ఎమ్మెస్ నారాయణ ఒత్తిడి వల్ల అల్కహాల్ తాగారట.అప్పుడే షూట్ ఉంది అని కోటాని రమ్మనడంతో మద్యం తాగే షూటింగ్ కి వెళ్లారట. ఇక చిరంజీవి కోట మద్యం సేవించాడనే విషయం తెలియడంతో బంగారు భవిష్యత్తును ఎందుకు పాడు చేసుకుంటున్నారు..

ఈ మద్యానికి ఎందుకు అలవాటు పడ్డారు.. మీకు మంచి టాలెంట్ ఉంది.ఇలాంటి పనులు చేసి మీ కెరీర్ మీద దెబ్బ పడేలా చేసుకోకండి అంటూ వార్నింగ్ ఇచ్చారట. అయితే ఈ వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని కోట శ్రీనివాసరావు  ఓ ఇంటర్వ్యూలో చెప్పి చిరంజీవి నా మంచి గురించే ఆ రోజు నన్ను మందలించారు. అయితే నేను మద్యం తాగుతానన్న విషయం నిజమే కానీ తాగిన మత్తులో ఎవరిని ఏమీ అనను. షూటింగ్లో ఎలా ఉండాలో అలానే ఉంటాను.కానీ కొంతమంది నాపై ఎన్నో రూమర్లు పుట్టించారు. నేను మద్యపానం తాగి షూటింగ్ కి వచ్చి గొడవ పెట్టానని,అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించానని రూమర్లు క్రియేట్ చేశారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు అంటూ కోట శ్రీనివాసరావు బతికున్న సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ పంచుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: