బాలయ్య నందమూరి నట సిం హం. ఇండస్ట్రీలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . ఎలాంటి క్యారెక్టర్స్ అయినా సరే బాలయ్య అవలీలగా నటించేస్తారు . అయితే బాలయ్య తన కెరియర్ లో ఎప్పుడు టచ్ చేయనటువంటి ఒక టఫ్ క్యారెక్టర్ ని చూస్ చేసుకున్నారు . అఖండ 2 సినిమాలో అఘోరగా కనిపించి మెప్పించాడు బాలయ్య . తన ఒరిజినల్ పెర్ఫార్మన్స్ చూపించారు . అప్పటివరకు బాలయ్య అంటే ఒక రొమాంటిక్ హీరో.. ఒక యాక్షన్ హీరో ..ఇలానే మాట్లాడుకునే వాళ్ళు జనాలు.  కానీ బాలయ్యలోని మరో డిఫరెంట్ యాంగిల్ కూడా ఉంది అంటూ బయట పెట్టింది అఖండ మూవీ .

సినిమా సృష్టించిన రికార్డ్స్ అన్ని ఇన్ని కావు. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతుంది . బోయపాటి శ్రీను - బాలయ్య కాంబో అంటేనే సెన్సేషన్ . అలాంటిది వాళ్ళ కాంబోలో వచ్చిన ఒక సెన్సేషనల్ హిట్ సినిమాకి సీక్వెల్ అంటే ఇది సెన్సేషనల్ కా బాప్ అనే రేంజ్ లో ఉంటుంది . ఈ సినిమా ప్రెసెంట్ సెట్స్ పై ఉంది .  ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ విషయంలో అఖండ 2 చిత్ర బృందం వెనకడుగు వేస్తుంది అన్న న్యూస్ ఇప్పుడు బాగా వైరల్ గా మారింది . నిజానికి ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయాలి అంటూ మూవీ మేకర్స్ ముందు నుంచే ఫిక్స్ అయ్యారట . అయితే  ఆ తైం లో భారీ కాంపిటీషన్ ఉంటుంది.

తెలుగు నుంచి రాజా సాబ్.. హిందీ నుంచి పలువురు స్టార్ హీరోల సినిమాలు డిసెంబర్ మొదటి వారంలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో మారిపోయిన పరిస్థితులకి మేకర్స్ రిస్క్  తీసుకోవాలి అనుకోవట్లేదు . ఆ కారణంగానే ఈ సినిమా డిసెంబర్ 18న రిలీజ్ చేయాలి అంటూ మూవీ మేకర్స్ ఆలోచిస్తున్నారట . ఒకవేళ అప్పటికి కూడా గ్రాఫిక్ పనులు పూర్తిగా కాకపోతే మాత్రం అఖండ మరింత ఆలస్యమే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటున్నారు సినీ ప్రముఖులు. కొంతమంది బాలయ్య సాధారణంగా ఇలాంటి విషయాలలో వెనకడుగు వేయరు అని.. చెప్పిన సమయానికి చెప్పినట్లు రిలీజ్ చేస్తారు అని .. ఆయన అఖండ  2 సినిమాను వేరే హీరోల సినిమాల కోసం వాయిదా వేసుకోవడం అనేది అస్సలు నచ్చట్లేదు అని మాట్లాడుతుంటే మరి కొంతమంది మాత్రం బాలయ్య రాజా సాబ్  సినిమాకు భయపడ్డాడు.. ఆ కరణంగానే సినిమా డేట్ ని వెనక్కి పోస్ట్ పోన్ చూసుకున్నారా..?? అంటూ ఘాటు ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు. దానికి అలాగే కౌంటర్స్ వేస్తున్నారు నందమూరి అభిమానులు..!!
 

మరింత సమాచారం తెలుసుకోండి: