టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ తాజాగా కింగ్డమ్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మిస్టర్ బచ్చన్ మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్గా నటించింది. గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ లో సత్యదేవ్ , విజయ్ కి అన్న పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ ని జూలై 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు. ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ మూవీ నుండి అన్న అంటేనే అంటూ సాగే సాంగ్ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ మూవీ యూనిట్ వారు అన్న అంటేనే అంటూ ఓ సాంగ్ నే చిత్రీకరించారు అంటే కచ్చితంగా ఈ సినిమా అన్నదమ్ముల అనుబంధంతో సాగుతుంది అనే అభిప్రాయాలను చాలా మంది వ్యక్తపరుస్తూ వస్తున్నారు. అన్నదమ్ముల అనుబంధంతో వచ్చిన సినిమాలు ఎన్నో తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. 

కింగ్డమ్ సినిమాలో కూడా అన్నదమ్ముల మధ్య సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయినట్లయితే ఈ మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంటుంది అని చాలా మంది భావిస్తున్నారు. ఇకపోతే కింగ్డమ్ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం విజయ్ వరుస అపజాలతో కెరియర్ను కొనసాగిస్తున్నాడు. మరి కింగ్డమ్ సినిమాతో ఆయనకు ఎలాంటి విజయం దక్కుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd