కలర్ ఫోటో డైరెక్టర్ మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకున్న సందీప్ రాజ్ అంటే తెలియని వారు ఉండరు. ఈయన ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీలో ఫేమస్ అయిపోయారు. అయితే అలాంటి కలర్ ఫోటో మూవీని తెరకెక్కించిన దర్శకుడు సందీప్ రాజ్ కి మాస్ మహారాజ రవితేజ చంపేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చారట.మరి ఇంతకీ రవితేజ సందీప్ రాజ్ కి మధ్య జరిగిన గొడవ ఏంటి..ఎందుకు రవితేజ డైరెక్టర్ కి చంపేస్తానని వార్నింగ్ ఇచ్చారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.కలర్ ఫొటో హిట్ అయినా కూడా ఈ యంగ్ డైరెక్టర్ కి రెండో సినిమా చేయడానికి దాదాపు 5 ఏళ్ళు పట్టింది. ప్రస్తుతం ఈ డైరెక్టర్ air ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనే వెబ్ సిరీస్తో మన ముందుకు రాబోతున్నారు.ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ రాజ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం నేను సుమ కనకాల కొడుకు రోషన్ కనకాలతో మౌగ్లీ అనే సినిమా చేస్తున్నాను. 

అయితే సినిమా హిట్ అయ్యాక కూడా యంగ్ హీరో తో సినిమా ఎందుకు తీస్తున్నారని మీ అందరికీ అనుమానం రావచ్చు.అయితే నేను ఇప్పటికే చాలామంది పెద్ద హీరోలకు స్టోరీలు చెప్పాను. కానీ నేను చెప్పిన స్టోరీలకు బడ్జెట్ ఎక్కువ కావడంతో అవన్నీ కార్యరూపం దాల్చడం లేదు. అలాగే రవితేజ గారితో కూడా ఓ సినిమా చేయాలని ఆయనకు స్టోరీ చెప్పాను. ఇక రవితేజకు నేను చెప్పిన స్టోరీ బాగా నచ్చింది.కానీ అప్పటికే ఆయనకు రెండు మూడు సినిమాలు ఉండడం కారణంగా మరో మూడేళ్లు ఆగుదాం అని నాతో అన్నారు. ఇక రవితేజ గారికి చెప్పిన స్టోరీని పక్కన పెట్టేసి మళ్ళీ ఫ్రెష్ గా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే లవ్ స్టోరీ తో సినిమా చేస్తున్నాను. అయితే రవితేజ గారితో దాదాపు సంవత్సరం పాటు ట్రావెల్ చేసి ఆయనకి కథ వివరించాను.

కానీ అప్పటికి ఆయనకు వేరే సినిమాలు ఉండడంతో నీ గోల్డెన్ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నావ్ అబ్బాయయ్.మరో రెండు సినిమాల తర్వాత నేనే నీతో ఈ సినిమా చేస్తాను అని నాకు మాటిచ్చారు. అంతేకాదు నాకు చెప్పిన ఈ సినిమా స్టోరీని ఏ హీరోకి కూడా చెప్పకు. ఒకవేళ నాతో కాకుండా ఈ స్టోరీని మరో హీరోతో చేస్తే చంపేస్తా అని సరదా వార్నింగ్ కూడా ఇచ్చారు అంటే సందీప్ రాజ్  చెప్పుకొచ్చారు.. ఇక సుమ కనకాల కొడుకుతో సినిమా తీయడానికి కారణం రోషన్ మొదటి సినిమా బబుల్ గమ్ లో  చాలా ఎనర్జిటిక్ గా కాన్ఫిడెంట్ గా చేశారు. అందుకే నా రెండో సినిమాకి రోషన్ ని ఎంచుకున్నాను అంటూ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో సందీప్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: