విక్టరీ వెంకటేష్ అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కే మూవి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రాబోతుంది. ఇదే విషయం ఇప్పుడు సినీ వర్గాలల్లో బాగా ట్రెండ్ అవుతుంది. ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్న కాంబినేషన్ ఇది .  నువ్వు నాకు నచ్చావ్ , మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ పెన్ చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు . ఇప్పటికి జనాలు ఆ విషయాలను గుర్తు పెట్టుకున్నారు . అలాంటి మ్యాజిక్ నే  ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు . వెంకటేష్ ఇమేజె కు తగ్గినట్లు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్ త్రివిక్రమ్  రాసుకున్నారు అంటూ ఓ న్యూస్ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అయింది .


అయితే ఈ సినిమా మరి కొద్ది రోజుల్లోనే సెట పైకి రాబోతుంది అన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెంకటేష్ ఈ సినిమాలో ఫుల్ ఫ్యామిలీ రోల్ లో కనిపించబోతున్నారట . వెంకీ ఏజ్ ని ఇమేజ్ ని రెండు మ్యాచ్ చేసేలా ఈ కథను రాసుకున్నారట త్రివిక్రమ్.  ప్యూర్ గా వెంకీకి మాత్రమే కీ రోల్ పోషించే విధంగా కాన్సెప్ట్ ఉండబోతుందట.  ఇది పూర్తిగా మల్టీ స్టారర్ సినిమా అయినప్పటికీ వెంకటేష్ క్యారెక్టర్ మాత్రం హైలైట్ గా మారబోతుంది అంటూ తెలుస్తుంది.  ఈ సినిమాకు హీరోయిన్ గా ఫస్ట్ ఛాయిస్ గా రుక్మిణి వసంత్ ని అనుకున్నారట .



ఆమె కాల్ షీట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ రోల్ లోకి సంయుక్త  మీనన్ ని తీసుకొచ్చినట్లు తెలుస్తుంది . కాగా ఈ సినిమా వచ్చే నెలలో సెట పైకి వచ్చే  అవకాశం ఉంది అంటూ ఫిలిం సర్కిల్స్లో ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది . అదే నిజమైతే మాత్రం డిసెంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేసి డిసెంబర్లో త్రివిక్రమ్ ఈ సినిమాని రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. డిసెంబర్లో సినిమాలకు ఎంత హై కాంపిటీషన్ ఉందో అందరికీ తెలిసిందే.  ఆ లిస్టులోకి త్రివిక్రమ్ - వెంకీ సినిమా చేరిపోయిందంటే బాక్స్ ఆఫీస్ వద్ద హీట్ పెంచేస్తుంది అంటున్నారు జనాలు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి: