బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. సల్మాన్ ఖాన్ కెరియర్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సినిమాలలో భజరంగీ భాయిజాన్ సినిమా ఒకటి. ఈ మూవీ లో కరీనా కపూర్ , సల్మాన్ ఖాన్ కి జోడిగా నటించగా ... కబీర్ ఖాన్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తండ్రి అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ కథను అందించాడు. విజయేంద్ర ప్రసాద్ కథను అందించిన బాహుబలి మొదటి భాగం విడుదల అయిన చాలా తక్కువ రోజుల గ్యాప్ లోనే ఈ సినిమా విడుదల అయింది.

ఇక దాదాపు ఒకే సమయంలో విడుదల అయిన ఈ రెండు సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించడంతో కథ రచయితగా విజయేంద్ర ప్రసాద్ కి ఈ రెండు మూవీల ద్వారా ఇండియా వ్యాప్తంగా గొప్ప గుర్తింపు వచ్చింది. ఇకపోతే బజరంగీ భాయిజాన్ సినిమా ఆ సమయంలో అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ద్వారా స్వల్మాన్ ఖాన్ క్రేజ్ మరింతగా పెరిగింది. ఇకపోతే చాలా మంది సల్మాన్ అభిమానులు , మామూలు ప్రేక్షకులు కూడా భజరంగీ భాయిజాన్ సినిమాకు సీక్వల్ ను రూపొందిస్తే బాగుంటుంది అని చాలా కాలంగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

ఇకపోతే తాజాగా ఈ మూవీ సీక్వెల్ కు సంబంధించిన ఓ అప్డేట్ ను ఈ మూవీ దర్శకుడు అయినటువంటి కబీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు. తాజాగా కబీర్ ఖాన్ మాట్లాడుతూ ... భజరంగీ భాయిజాన్ మూవీ కి సీక్వెల్ కచ్చితంగా తీస్తాము అని , కాకపోతే ఏదో సీక్వెల్ అడ్వాంటేజ్ ను యూస్ చేసుకోవడం కోసం కాకుండా ఒక మంచి కథ దొరికిన సమయంలో భజరంగీ భాయిజాన్ మూవీ కి సీక్వెల్ చేస్తాము అని ఈ మూవీ దర్శకుడు చెప్పుకొచ్చాడు. దానితో ఈ మూవీ సీక్వెల్ ఉండవచ్చు కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఉండదు అని కబీర్ ఖాన్ మాటల ద్వారా అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: