
ఇప్పటివరకు ఈ విషయం పైన ఈ జంట కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అంటూ తెలియజేస్తున్నప్పటికీ కానీ వీరు చేసే కొన్ని కొన్ని పనుల వల్ల వీరిద్దరూ లవ్ లో ఉన్నారనే రూమర్స్ కు మరింత బలాన్ని చేకూర్చేలా చేస్తూ ఉంటాయి. ఇద్దరు కూడా ఒకే కారులో ప్రయాణించడంతో దాదాపుగా వీరిద్దరి లవ్ కన్ఫర్మ్ అయ్యిందనే విధంగా అభిమానులు భావించారు. అయితే తాజాగా ఇప్పుడు ఈ జంటకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆశ్చర్యపోతున్నారు అభిమానులు.
అయితే వైరల్ గా మారుతున్న ఈ ఫోటోలలో రష్మిక, విజయ్ మ్యారేజ్ చేసుకున్నట్లుగా కొన్ని ఫోటోలు వైరల్ చేశారు. మెడలో పూలదండలతో కనిపించిన ఈ ఫోటోలలో రష్మిక పెళ్లికూతురుగా, విజయ్ పెళ్లి కొడుకుగా ముస్తాబయ్యి మరి కనిపించారు. అయితే ఈ ఫోటోలన్ని కూడా ఎవరో క్రియేట్ చేసి మరి విడుదల చేశారనే విధంగా కనిపిస్తున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఇది నిజమైతే బాగుండు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఫోటోలను చూసిన ఈ జంట ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాలో నటిస్తున్నారు. రష్మిక లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటిస్తోంది.