టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ తాజాగా హిందీ సినిమా అయినటువంటి వార్ 2 లో నటించాడు. ఈ మూవీ లో హృతిక్ రోషన్ కూడా నటించాడు. ఈ సినిమాను ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నారు. వార్ 2 మూవీ చిత్రీకరణ దశలో ఉండగానే తారక్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఓ మూవీ కి కమిట్ అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ఈ మూవీ షూటింగ్ కూడా చాలా వేగంగా జరుగుతుంది. ఇలా ఓ మూవీ ని పూర్తి చేసి మరో మూవీ లో నటిస్తున్న తారక్ ఇప్పటికే రెండు సినిమాలకు కమిట్ అయి కూడా ఉన్నాడు.

తారక్ తన తదుపరి మూవీలను త్రివిక్రమ్ శ్రీనివాస్ , నెల్సన్ దిలీప్ కుమార్ ల దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ ఇద్దరు దర్శకులతో తారక్ చేయబోయే సినిమాలను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించబోతున్నాడు. ఇప్పటికే ఈ విషయంపై నాగ వంశీ క్లారిటీ కూడా ఇచ్చేశాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ కలిగిన దర్శకులలో బాబి కొల్లి ఒకరు. ఈయన ఇప్పటివరకు చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో కొన్ని మూవీలు మంచి విజయాలను కూడా అందుకున్నాయి. ఆఖరుగా ఈ దర్శకుడు నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా రూపొందిన డాకు మహారాజ్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇప్పటికే డాకు మహారాజ్ సినిమా విడుదల అయ్యి ఆరు నెలలు గడుస్తున్నా ఈయన తదుపరి మూవీ కి సంబంధించి అధికారిక ప్రకటన వెలబడలేదు. కాకపోతే ప్రస్తుతం ఈయన తారక్ కోసం ఒక కథను రెడీ చేస్తున్నట్లు , అంతా ఓకే అయితే మరికొన్ని రోజుల్లోనే తారక్ కి ఓ స్టోరీని వినిపించనున్నట్లు తెలుస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం తారక్ హీరో గా రూపొందిన జై లవకుశ సినిమాకు బాబీ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: