పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హర హర వీరమల్లు మూవీ తాజాగా విడుదలై పాజిటివ్ టాక్ తో దుమ్ము రేపుతోంది. ఇప్పటికే ప్రీమియర్ షోస్ చూసిన నెటిజన్లు  అద్భుతమైన రివ్యూలు ఇస్తున్నారు.దాంతో ప్రస్తుతం దేశం మొత్తం హరిహర వీరమల్లు సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు.. అయితే హరిహర వీరమల్లు సినిమా విడుదలవ్వడంతో అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా హాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ పుష్ప-2 హష్ ట్యాగ్  నెట్టింట్లో వైరల్ చేయడంతో చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు వాళ్ళ కామెంట్లను తిప్పి కొడుతున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు పుష్ప -2 ప్రీమియర్ షో రికార్డ్స్ ని ఇప్పటి వరకు ఏ హీరో కూడా బ్రేక్ చేయలేదని, బ్రేక్ చేయరు అంటూ పుష్ప -2  హాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు..


 అంతేకాదు ఇప్పటివరకు ఇలాంటి రికార్డులు టచ్ చేసి మగాడు లేడు అంటూ X ఖాతా ద్వారా పోస్టులు పెట్టడంతో చాలా మంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతూ కౌంటర్లు ఇస్తున్నారు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ పుష్ప టు తో పాటు ఆల్ టైం ప్రీమియర్ రికార్డ్స్ బ్రేక్ అంటూ ఎక్స్ ఖాతాలో అల్లు అర్జున్ అభిమానులకు కౌంటర్లు ఇస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులు పుష్ప టు గురించి పవన్ కళ్యాణ్ అభిమానులు హరిహర వీరమల్లు గురించి పోస్టులు పెద్ద ఎత్తున చేయడంతో పుష్ప-2 వర్సెస్ హరిహర వీరమల్లు హ్యాష్ ట్యాగ్ లతో పెద్ద ఎత్తున పోస్టులు  X లో వైరల్ అవుతున్నాయి. అయితే పుష్ప-2 విడుదల సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ పుష్ప-2 సినిమాను బాయికట్ చేసి సినిమా చూడడానికి వెళ్ళలేదు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు కూడా అదే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాని బాయికట్ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు పుష్ప -2 మూవీ ని ఎంత తొక్కినా కూడా సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం మాత్రం ఆపలేదు. మరి పవన్ కళ్యాణ్ సినిమాని అల్లు అర్జున్ అభిమానులు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి హరిహర వీరమల్లు సినిమా ఆంటీ ఫ్యాన్స్ నుండి తప్పించుకొని హిట్ అయి బయట పడుతుందా అనేది చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికి మొదటి షో తోనే పాజిటివ్ టాక్  రావడంతో సినిమాపై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి.కచ్చితంగా ఈ సినిమా కి టాక్ బాగుంది కాబట్టి మరింతమంది ప్రేక్షకులు సినిమా చూడడానికి థియేటర్ల ముందు క్యూలు కడతారని అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: